నేను కొత్తగా వచ్చినా..: జగన్‌పై అఖిల ఆగ్రహం, కేఈ చమత్కారాలు
తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక, ఓర్వలేక ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ అధినేత జగన్ విమర్శలు చేస్తున్నారని మంత్రి అఖిలప్రియ విమర్శించారు.
కర్నూలు: తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక, ఓర్వలేక ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ అధినేత జగన్ విమర్శలు చేస్తున్నారని మంత్రి అఖిలప్రియ విమర్శించారు.

18 గంటలు కష్టపడుతున్నారు
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రికి రాష్ట్రమంతా సహకరించాలన్నారు. ఆళ్లగడ్డలో నవ నిర్మాణ దీక్షలో భాగంగా శనివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.

రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా..
తాను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా ఎంతగానో ప్రోత్సహించి అన్ని విధాలా చంద్రబాబు అండగా నిలుస్తున్నారని చెప్పారు. అవినీతి నిర్మూలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జిల్లాలో సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు.

మహిళల్ని నేలపై కూర్చోబెడతారా?
పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషి తన చివరి రక్తపు బొట్టు వరకు కొనసాగిస్తూ ప్రజాసేవకే అంకితమవుతానని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. పత్తికొండ నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఓ వైపు చలోక్తులు విసురుతూనే మరోవైపు అధికారులకు చురకలు అంటించారు కేఈ కృష్ణమూర్తి. బహిరంగ సభలో మహిళలను నేలపై కూర్చోబెట్టడం బాధాకరంగా ఉందన్నారు. టిడిపి ప్రభుత్వ ఏర్పాటులో మహిళల పాత్ర కీలకమైదని, వారి ఓట్లువల్లే తాము అధికారంలోకి వచ్చామన్నారు. అలాంటి మహిళలను గౌరవించాల్సిన బాధ్యతను అధికారులు విస్మరిస్తున్నారని, ఇలా చేయడం రెండోసారి అన్నారు.

వారికన్నా ఆరోగ్యంగా ఉన్నా
తనకు వయసు అయిపోయిందని ఈ వయస్సులోనూ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి కృషి చేస్తున్నట్లు మద్దికెర జడ్పీటీసీ సభ్యుడు పెరవలి పురుషోత్తమ్ చౌదరి తన ప్రసంగంలో ప్రస్తావించడాన్ని కేఈ కృష్ణమూర్తి గుర్తుచేస్తూ చౌదరి కన్నా తానే శారీరకంగా ఆరోగ్యకరంగా ఉన్నట్లు చమత్కరించారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications