నంద్యాల మాదే, 24న అభ్యర్థి ప్రకటన: అఖిల, బాబుకు శిల్పా అల్టిమేటం?

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు అఖిల ప్రియ బుధవారం నాడు తేల్చి చెప్పారు. ఆమె ఈ రోజు భవానీ ఐల్యాండ్‌ను సందర్శించారు.

నంద్యాల ఉప ఎన్నిక: టిడిపిలో రసవత్తర రాజకీయం

ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా హాయ్‌ల్యాండ్‌లో ఫైవ్‌స్టార్ హోటళ్లతో పాటు మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నంద్యాల ఉప ఎన్నికపై స్పందించారు.

భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనిపై మాట్లాడుతూ.. తాము పోటీ చేస్తామని, ఈ నెల 24వ తేదీన శోభా నాగిరెడ్డి వర్ధంతి రోజున అభ్యర్థి ఎవరో ప్రకటిస్తామని చెప్పారు.

అనంతరం ఆమె సీఎం చంద్రబాబును కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. శిల్పా మోహన్ రెడ్డి చంద్రబాబును కలిసినట్లుగా తెలియదని చెప్పారు. తాను తన శాఖకు సంబంధించిన అంశాలు చర్చించేందుకు వచ్చానని చెప్పారు.

చంద్రబాబు నుంచి హామీ లభించిందా?

చంద్రబాబు నుంచి హామీ లభించిందా?

తామే పోటీ చేస్తామని, త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామని అఖిల ప్రియ చెప్పడం ఆసక్తిని రేపుతోంది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆమెకు హామీ ఇచ్చారా? ఆ ధైర్యంతోనే అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారా? అంటే కావొచ్చునని అంటున్నారు.

అంతర్గత చర్చ

అంతర్గత చర్చ

నంద్యాల ఉప ఎన్నికల రేసులో భూమా కుటుంబం, శిల్పా వర్గం, ఇతర ఆశావహులు ఉన్నారు. ఎవరికి వారు దీనిపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

అఖిలప్రియ ప్రకటన

అఖిలప్రియ ప్రకటన

నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు భూమా కుటుంబంతో పాటు శిల్పా మోహన్ రెడ్డి ప్రధానంగా రేసులో ఉన్నారు. కానీ బహిరంగంగా ప్రకటన చేయలేదు. ఇప్పుడు అఖిలప్రియ ఉపఎన్నికపై మాట్లాడారు.

బాబుకు శిల్పా అల్టిమేటం?

బాబుకు శిల్పా అల్టిమేటం?

శిల్పా సోదరులు అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలుస్తారు. తనకు నంద్యాల టిక్కెట్ ఇవ్వాల్సిందేనని శిల్పా మోహన్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఇదే విషయం చెప్పనున్నారు.

తనకు టిక్కెట్ ఇవ్వకుంటే వైసిపిలో చేరుతానని చెప్పనున్నారని తెలుస్తోంది. కాగా, మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు రాయబారం నడిపి శిల్పాను చంద్రబాబు వద్దకు తీసుకు వచ్చారు. చంద్రబాబుతో భేటీ అనంతరం శిల్ప తగ్గవచ్చునని, ఆయనకు అధినేత ఏమైనా హామీ ఇవ్వవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. అప్పుడు వైసిపిలోకి చేరికను వాయిదా వేసుకుంటారా లేక టిడిపిలోనే ఉంటానని ప్రకటిస్తారా చూడాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Akhila Priya on Wednesday said that Bhuma Nagi Reddy family member will contest from Nandyal.
Please Wait while comments are loading...