అమ్మానాన్నలు గుర్తొచ్చారు, అందుకే తడబాటు: అఖిల ప్రియ

తల్లి మరణంతో ఎమ్మెల్యేను అయ్యానని, తండ్రి మరణంతో మంత్రిని అయ్యానని భూమా అఖిల ప్రియ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

విజయవాడ: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తు న్న సమయంలో అమ్మా నాన్న గుర్తుకు రావడంతో గొంతు తడబడిందని శాసనసభ్యురాలు అఖిలప్రియ అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆదివారంనాడు ఆమె కాస్తా తడబడిన విషయం తెలిసిందే.

మంత్రిగా ప్రమాణ స్వీకార చేసే సమయంలో ఉద్వేగానికి గురయ్యానని ఆమె చెప్పారు. పుట్టినరోజు నాడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని సిఎంవో నుంచి ఫోన్ వచ్చినప్పుడు అమ్మా నాన్నల ఫొటోల వద్దకు వెళ్లి ఏడ్చానని చెప్పారు.

Akhila Priya says father and mother came into mind

అమ్మ చనిపోవడంతో ఎమ్మెల్యేను అయ్యానని, తండ్రి చనిపోవడంతో మంత్రిని కావాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయం తలచుకుంటే బాధకలుగుతోందంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రివర్గంలో తానే పిన్నవయస్కురాలినని, అందరి సలహాలు తీసుకుంటానని తెలిపారు.

అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి అస్వస్థకు గురై మరణించగా, తల్లి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+