వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌పై తేల్చేసిన అఖిల, శిల్పాపై తీవ్రవ్యాఖ్యలు, ఆమెవల్లేనని చక్రపాణి రెడ్డి

తన తండ్రి భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారని మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ఆరోపణలు చేశారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: తన తండ్రి భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారని మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ఆరోపణలు చేశారు.

అయినప్పటికీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డికి మద్దతు ఇచ్చి, గెలిపించామని అఖిల చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డికి ఘోర ఓటమి తప్పదని చెప్పారు.

పవన్ కళ్యాణ్‌తో మా కుటుంబానికి మంచి సంబంధాలు

పవన్ కళ్యాణ్‌తో మా కుటుంబానికి మంచి సంబంధాలు

ఆయనకు ఓటు వేస్తే నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటారనే భయం ఓటర్లలో ఉందని అఖిలప్రియ చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ కుటుంబానికి ఆయన అండగా ఉంటారన్నారు.

Recommended Video

Pawan Kalyan wrote a letter to Party Cadre
పవన్ కళ్యాణ్ కరుణించేనా?

పవన్ కళ్యాణ్ కరుణించేనా?

పవన్ కళ్యాణ్ సోమవారం మాట్లాడుతూ.. తాను నంద్యాల ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు ఎవరికి మద్దతివ్వాలో నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రెండు రోజుల్లో నిర్ణయం ఉంటుందన్నారు. అయితే భూమా కుటుంబంతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. కాబట్టి ఆ కుటుంబానికి మద్దతిచ్చే అవకాశాలున్నాయి. భూమా నాగిరెడ్డి ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు.

టిడిపిలో అవమానాలు

టిడిపిలో అవమానాలు

టిడిపిలో తాను ఎన్నో అవమానాలు భరించాల్సి వస్తోందని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీలు అమలు చేస్తే టిడిపిలో కొనసాగేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

అఖిలప్రియపై శిల్పా చక్రపాణి నిప్పులు

అఖిలప్రియపై శిల్పా చక్రపాణి నిప్పులు

మంత్రి అఖిలప్రియను కలుపుకొని వెళ్లాలని తాను ఎంతగానో ప్రయత్నించానని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. కానీ ఆమె కూడా తనను అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం నియోజకవర్గాన్ని తనకు అప్పగించాలన్నారు.

English summary
Telugu Desam Party leaders and Minister Akhila Priya on Tuesday said that Jana Sena chief Pawan Kalyan will support Bhuma Brahmananda Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X