తెరపైకి చెల్లి, ఫ్యామిలీలో విభేదాలు..: అఖిలప్రియ షాకింగ్, వేలు జగన్ వైపా?

టిడిపి నేత, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. కొందరు తమ కుటుంబంలో కూడా విభేదాలు తెచ్చే ప్రయత్నాలు చేశారని, వాటిని దాటుకొని తాము భూమా బ్రహ్మానంద రెడ్డిని బరిలో నిలిపామన్న

నంద్యాల: టిడిపి నేత, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. కొందరు తమ కుటుంబంలో కూడా విభేదాలు తెచ్చే ప్రయత్నాలు చేశారని, వాటిని దాటుకొని తాము భూమా బ్రహ్మానంద రెడ్డిని బరిలో నిలిపామన్నారు.

చదవండి: కాదనడానికి నువ్వెవరు?: శిల్పాపై అఖిలప్రియ నిప్పులు, పొత్తులపై..

అఖిలప్రియ ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తన చెల్లెలు మౌనిక తనకు చెప్పిందని తెలిపారు.

భూమా కుటుంబంలోని చిచ్చు పెట్టాలని చూశారా?

భూమా కుటుంబంలోని చిచ్చు పెట్టాలని చూశారా?

తన చెల్లెలికి సర్దిచెప్పి తన సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపామన్నారు. అంటే తమ కుటుంబంలోను కొందరు విభేదాలు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. అయితే విభేదాలు తీసుకు రావడానికి ఎవరు ప్రయత్నించారో ఆమె చెప్పలేదని తెలుస్తోంది.

అఖిలప్రియ వేలు వైసిపి వైపా?

అఖిలప్రియ వేలు వైసిపి వైపా?

భూమా నాగిరెడ్డి మృతి తర్వాత నంద్యాల ఉప ఎన్నిక చర్చకు దారి తీసింది. ఇక్కడ టిడిపి ఎవరిని నిలబెడుతుంది, వైసిపి పోటీ చేస్తుందా అని తొలుత చర్చ జరిగింది. జగన్ పోటీలో ఉంటామని ప్రకటించాక మరింత ఉత్కంఠ పెరిగింది. అప్పటికి టిడిపిలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి, మంత్రి అఖిలప్రియ కుటుంబాలలో... ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్న అంశంపై అధిష్టానం సర్వే చేసింది. మరోవైపు, టిడిపి భూమా కుటుంబానికి ఇస్తే శిల్పాకు, అలాకాకుండా టిడిపి శిల్పాకు ఇస్తే భూమా కుటుంబం సభ్యులను నిలబెట్టాలని జగన్ యోచించినట్లుగా ప్రచారం జరిగింది. ఎలాగైనా టిడిపికి చెక్ చెప్పాలని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో భూమా కుటుంబంలోనూ ఒకరికి టిక్కెట్ ఇస్తే మరొకరిని తెరపైకి తీసుకు రావడం ద్వారా టిడిపిని ఇబ్బంది పెట్టాలని వైసిపి చూసిందా, అందుకే అఖిలప్రియ అలా మాట్లాడారా అనే చర్చ సాగుతోంది.

ఇక బాధ్యత నాది.. అఖిల

ఇక బాధ్యత నాది.. అఖిల

నంద్యాల ఉప ఎన్నిక తన తండ్రి నియోజకవర్గంలో జరుగుతోందని మంత్రి అఖిలప్రియ అన్నారు. తన తండ్రి చేయాల్సిన పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత తన పైన ఉందన్నారు. ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యతతో ఆడబిడ్డగా మాట్లాడుతున్నానని అంటున్నారు.

నంద్యాల వ్యూహరచనలు

నంద్యాల వ్యూహరచనలు

నంద్యాల ఉప ఎన్నికలపై టిడిపి, వైసిపిలు వ్యూహ రచనలు చేస్తున్నాయి. ఇప్పటికే నేతలు ప్రచారం కూడా చేస్తున్నారు. సోమవారం సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో సమావేశమై, నంద్యాల ఉప ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+