నాగార్జునను కామెంట్ చేసిన పూజాహెగ్డే!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిన్నటివరకు స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్డే ఉంది. కాకపోతే ఈమధ్యే కాస్తంత జోరు తగ్గింది. అందరూ స్టార్ హీరోల సరసన నటించింది. ఇప్పుడు సినిమాలు తగ్గుతుండటంతో పూజా పనైపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ ప్రకటనల్లో నటిస్తూ తన జోరును పూజా చూపిస్తోంది. తాజాగా ఆమె మాజా డ్రింక్ యాడ్ లో కనిపించింది.
ఈ ప్రకటనలో పూజాతోపాటు కింగ్ నాగార్జున కూడా ఉన్నారు. కింగ్ ను పూజాహెగ్డే అన్నయ్యా అని పిలవడం విశేషం. నాగార్జున ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్.. ఇద్దరి సరసన నటించింది. ఇప్పుడు వచ్చిన ప్రకటన ప్రకారం వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. నాగ్ తన శివ సినిమాలోని పాటను హమ్ చేస్తుంటాడు. నాగార్జున పాడే పాటకు ఇతర కుటుంబ సభ్యులంతా సింక్ అయి హమ్ చేస్తుంటారు.

ఇంతలో నాన్ సింక్ లో వచ్చిన పూజ ఆ పాటను దారుణంగా పాడుతుంది. అందరూ ఆమె పాడిన తీరుకు షాకౌతారు. అయితే నాగార్జున మాత్రం.. పాట బాగా పాడకపోయినా డ్యాన్స్ బానే వేస్తుంది కదా అమ్మూ అంటూ సపోర్ట్ చేస్తాడు. వెంటనే అన్నయ్యా అంటూ పిలుస్తుంది. అందరూ నవ్వుతారు. తాజాగా ఈ యాడ్ ను పూజాహెగ్డేనే షేర్ చేసింది. 'కుటుంబంలో అందరినీ అంగీకరించడం కూడా ఔదార్యమే' అంటూ క్యాప్షన్ పెట్టింది.
మాజా కుటుంబాన్ని ఒకటి చేస్తుందంటూ మాజా తాగిద్దాం, అందరికీ చేరువ అవుదాం అంటూ ఆ క్యాప్షన్ లో పేర్కొంది. ఈ వీడియోకి నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పూజా నాగార్జునను అన్నయ్యా అంటూ కామెంట్ చేయడంతో అందరి దృష్టి నాగార్జునమీదే పడింది. వయసు పెరగడం అనేది నాగార్జునకు ఆగిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. పూజా కూడా ఈ యాడ్ లో చాలా అందంగా కనిపించింది. నాగ్ లుక్ మెస్సీగా ఉంది. పూజా ఇంతవరకు కొత్త సినిమాను అంగీకరించలేదు.












Click it and Unblock the Notifications