మద్యం మత్తులో అర్ధరాత్రి యువతి హంగామా

ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. పోలీసులు ఆమెను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్పింది. కొంత హడావుడి చేసింది. తనపై ఎవరో అత్యాచారం చేసి వదిలేశారని చెప్పింది. పోలీసులు విచారించడంతో ఆమె హడావుడి చేసిందని గుర్తించారు.
అటవీ శాఖ అధికారి హత్య కేసులో అరెస్ట్
జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి హత్య కేసులో 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నాలుగు ట్రాక్టర్లు, ఆటో, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 15 మంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి, సాగు చేస్తున్నారన్న సమాచారంతో కెకె తండా వెళ్లిన గంగయ్య పైన కొందరు ఇటీవల విచక్షణరహితంగా దాడి చేయడంతో మృతి చెందారు.
విద్యార్థి అనుమానాస్పద మృతి
నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ శివారులో ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు దోతిగూడెంకు చెందిని ప్రవీణ్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications