తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. బ్యాంకులకు ఏప్రిల్ నెలలో ఏకంగా అన్ని సెలవులా..?
ఏ దేశమైనా.. ఏ ప్రాంతమైనా కానీ ఆర్ధిక రంగంలో బ్యాంకింగ్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయినప్పటికీ చాలామంది ప్రజలు బ్యాంకుల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయి.. అనే విషయం కూడా పరిగణలోకి వస్తుంది. ఈ మేరకు రాబోయే ఏప్రిల్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు దినాలను ప్రకటించారు.
ఏప్రిల్ నెలలో తెలుగు రాష్ట్రాల లోని బ్యాంకులకు దాదాపు 11 రోజుల సెలవులు ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం, ఆదివారాలతో పాటు.. పండుగలు, ప్రత్యేక రోజులు ఉండటంతో బ్యాంకులు ఎక్కువగా మూతపడనున్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

బ్యాంకుల సెలవుల వివరాలు..
ఏప్రిల్ 1 - ఆర్థిక సంవత్సర ప్రారంభ దినోత్సవం ( దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు )
ఏప్రిల్ 5 - బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి ( తెలంగాణలో బ్యాంకులకు సెలవు )
ఏప్రిల్ 14 - అంబేద్కర్ జయంతి ( దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు )
ఏప్రిల్ 18 - గుడ్ ఫ్రైడే ( ఏపీ, తెలంగాణలో బ్యాంకులకు సెలవు )
అలానే శని, ఆదివారాలను కలిపి 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 1, 14, 18తో పాటు శని, ఆదివారాలను కలిపి 10 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నట్టు ప్రకటించారు. ఏపీలో 10 రోజులు, తెలంగాణలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. బ్యాంకింగ్ అవసరాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications