రైలు ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు దారి మళ్లింపు..
ఏపీలో రైలు ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాక్ పనుల కారణంగా జూన్ 21 నుంచి జులై నెలాఖరు వరకు పలు రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులకు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. అందుకు తగిన విధంగా వేరే ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
విజయవాడ రైల్వే డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాక్ పనుల కారణంగా పలు రైళ్లను రామవరప్పాడు వరకు నడపనున్నట్లు అధికారులు చెప్పారు. నరసాపురం నుంచి విజయవాడ వెళ్లే డెమో రైలును రామవరప్పాడు వరకే నడవనుంది. ప్రయాణికులకు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా అధికారులు సూచించారు. ఇక, ఈ ట్రైన్ ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. ఆ డెమో రైలు రామవరప్పాడులో తిరిగి రాత్రి 8 గంటలకు బయల్దేరి అర్ధరాత్రి 12 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.

జూలై 6 నుంచి 27 వరకు బావ్‌నగర్- కాకినాడ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ భీమవరం, గుడివాడ మీదుగా వెళ్లనుంది. ఇక, జూలై 1 నుంచి 22 వరకు ఎర్నాకులం- పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలును భీమవరం, గుడివాడ మీదుగా నడపనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు ముంబై - భువనేశ్వర్ ట్రైన్ జులై 1 నుంచి 26 వరకు భీమవరం మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే శాఖ అధికారులు వివరించారు. ప్రయాణికులు రైళ్లు దారి మళ్లించిన అంశాన్ని గమనంలో ఉంచుకుని ఇతర ప్రత్యమ్నాయాలతో జర్నీ ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications