రేషన్ బియ్యం తీసుకోకుంటే నగదు జమ.. అక్కడ నుండే షురూ!
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ అక్రమాలకు చెక్ పెడుతున్న ఏపీ ప్రభుత్వం లబ్దిదారుల క్జోసం మరో కొత్త విధానం తీసుకురావటానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే రేషన్ అక్రమాలకు చెక్ పెడుతూ పారదర్శక రేషన్ విధానాన్ని అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మరో కీలక అడుగు వెయ్యాలని భావిస్తోంది.
రేషన్ బియ్యం తీసుకోకుంటే నగదు జమ
రేషన్ షాపుకు వెళ్లి బియ్యం తీసుకోకపోతే మిగిలిన కోటా విలువను నేరుగా బ్యాంక్ ఖాతాలో నగదుగా జమ చేసే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రేషన్ సరుకుల్లో జరుగుతున్న అక్రమాలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం రేషన్ కార్డుదారులు కూపన్లు తీసుకుని డీలర్ల వద్ద బియ్యం తీసుకుంటున్నారు.

గుజరాత్ లో పైలెట్ ప్రాజెక్ట్ అధ్యయనం చేసిన ఏపీ అధికారులు
ఒకవేళ బియ్యం తీసుకోకపోతే ఆ కోటాను లెక్కించి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ద్వారా లబ్ధిదారుడి ఖాతాలో నేరుగా జమ చేస్తారు. గుజరాత్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానం విజయవంతంగా నడుస్తుండటంతో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ అధికారులు అక్కడ పర్యటించి ఈ విధానాన్ని పరిశీలించారు.
విశాఖపట్నంలో నగదు బదిలీ కార్యక్రమం పైలెట్ ప్రాజెక్ట్
తొలుత విశాఖపట్నంలో ఈ నగదు బదిలీ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్కడి అనుభవాలు, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. చాలా మంది లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకోవడం లేదు. దీంతో మిగిలిన బియ్యం బ్లాక్ మార్కెట్‌కు వెళుతోంది. కొందరు డీలర్‌కే తిరిగి అమ్ముతున్నారు, మరికొందరు పాలిష్ చేసి విదేశాలకు తరలిస్తున్నారు.
అక్రమ రవాణా, దుర్వినియోగం తగ్గించేలా కొత్త విధానం
ఈ కొత్త విధానం వల్ల అక్రమ రవాణా, దుర్వినియోగం తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు రేషన్ అవసరం లేని వారికి నగదు వస్తుందంటే వారే ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. త్వరలోనే అధికారిక ప్రకటన, విధివిధానాలు జారీ కానున్నాయి. అమల్లోకి వస్తే రేషన్ కార్డుదారులు బియ్యం బదులు నగదు తీసుకునే అవకాశం లభిస్తుంది. ఇది లబ్ధిదారులకు సౌకర్యంగా, వ్యవస్థలో పారదర్శకత పెంచే దిశగా ముఖ్యమైన అడుగుగా ఉంటుంది.













Click it and Unblock the Notifications