రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూమి గుండ్రంగా ఉన్నట్లు... ఆపార్టీవైపు చూస్తున్న అలీ?

|
Google Oneindia TeluguNews

భూమి గుండ్రంగా ఉంటుంది. తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడిచుట్టూ తిరుగుతుందని చిన్నప్పుడు సామాన్య శాస్త్రం పాఠాల్లో చదువుకున్నాం. సరిగ్గా ఇదే సూత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ కమెడియన్ గా ఉన్న అలీకి కూడా వర్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే తన సన్నిహితుడు, ప్రతి సినిమాలో అవకాశం కల్పించి ప్రోత్సహిస్తున్న పవన్ కల్యాణ్ ను కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపు చూశారు.

అలీని పిలిపించి మాట్లాడిన జగన్

అలీని పిలిపించి మాట్లాడిన జగన్

2019 ఎన్నికలకు ముందే అలీని పిలిపించి జగన్ మాట్లాడారు. దీంతో ఆయన స్నేహ బంధాన్ని విస్మరించి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అలీకి రాజ్యసభ సభ్యత్వంకానీ, లేదంటే క్యాబినెట్ హోదాతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గానీ ఇస్తారనుకున్నారు. కానీ అవేమీ నెరవేరలేదు. అదిగో పదవి అంటే ఇదిగో నియామకపత్రం అన్నట్లుగా తయారైంది. వేచిచూసి చూసి ఇక పదవి రాదని నిర్థారించుకున్న అలీ తిరిగి జనసేనవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

 తూర్పుగోదావరిలో జనసేన బలంగా ఉండటంతో..

తూర్పుగోదావరిలో జనసేన బలంగా ఉండటంతో..


సొంత జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి కావడం, రాజమండ్రి కావడం, జనసేన పార్టీ ఇక్కడ బలంగా ఉండటంతో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేసి అసెంబ్లీలో అడుగు పెడదామనే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారైనా ఎమ్మెల్యే అవ్వాలనేది అలీ కోరిక. గతంలో తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తారంటూ వార్తలు వచ్చాయి. రానున్న ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో జనసేన కొన్ని సీట్లు గెలవగలదని వార్తలు వస్తున్నాయి. రాజమండ్రి రూరల్ కానీ, జిల్లాలోనే వేరే నియోజకవర్గం నుంచి కానీ పోటీచేయాలనే ఉత్సుకతతో అలీ ఉన్నారు.

ఆగ్రహం కలిగించేలా వ్యాఖ్యలు?

ఆగ్రహం కలిగించేలా వ్యాఖ్యలు?


జనసేనానికి దూరం జరిగిన కాలంలో అలీ చేసిన వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ కే కాక, ఆయన అభిమానులకు కూడా ఆగ్రహం కలిగించాయి. పవన్ కల్యాణ్ తన సినిమాల్లో అలీని దూరం పెట్టసాగారు. 2019 ఎన్నికల నుంచి ఈరోజు వరకు పవన్ నటించిన సినిమాల్లో అలీకి అవకాశం లభించలేదు. సందర్భం వచ్చిన ప్రతి సారీ మిత్రులుగా ఉన్నవారు ఎలా వ్యవహరించారో? మనసును ఎంత బాధపెట్టారో పవన్ చెబుతుండేవారు. పవన్ ప్రతి సినిమాలో చిన్న పాత్రైనా దర్శకులు అలీ కోసం సృష్టించేవారు. వైసీపీలో చేరడం, పవన్ పై విమర్శలు, ఆ తర్వాత జనసేనాని బాధను వ్యక్తం చేయడం, వైసీపీ నుంచి ఏ పదవీ రాకపోవడం లాంటివన్నింటితో తిరిగి తిరిగి ఆయన జనసేనవైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని ఆయన కూడా ఖండించడంలేదు. అలీ కోరిక నెరవేరుతుందా? ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పేలాలేదు.!!

English summary
He looked towards the YSR Congress party and not his close friend Pawan Kalyan, who is encouraging him in every film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X