Video: గవర్నర్ కాన్వాయ్ కోసం గర్భిణి ప్రాణాలతో ఆటలా?

ఆమె ఒక నిండు గర్భిణి.. పురిటి నొప్పులతో విలవిలలాడుతూ ఆసుపత్రికి వెళ్తోంది. మరోవైపు నిమిష నిమిషానికీ ట్రాఫిక్ సిగ్నల్ దాటకపోతే ప్రాణాలకే ప్రమాదమని ఆందోళన చెందుతున్న ఒక సగటు భర్త. కానీ, ఆ ఆసుపత్రి దారికి అడ్డంగా నిలిచింది ఒక 'వీఐపీ కాన్వాయ్'! ఆ గర్భిణిని మోసుకెళ్తున్న వాహనంతో పాటు వందలాది వాహనాలను పోలీసులు రోడ్డుపైనే స్తంభింపజేశారు. నిమిషాలు గడుస్తున్నాయి.. భార్య బాధను చూడలేక, పోలీసుల బ్రతిమిలాడినా కరగని 'ఖాకీ'ల హృదయాలను చూసి, ఆ భర్త ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

ఇంకేం చేయాలో పాలుపోక.. భార్య ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ నిస్సహాయుడైన సామాన్యుడు నడిరోడ్డుపై కూర్చుని కన్నీటితో నిరసన తెలిపాడు. సిలికాన్ సిటీ బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ హృదయవిదారక ఘటన, దేశవ్యాప్తంగా 'వీఐపీ సంస్కృతి'పై ప్రజల్లో మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది.

Man Sits on Bengaluru Road After Governor Convoy Traffic Halt Delays Hospital Rush for Pregnant Wife

అండర్‌పాస్ నరకం.. దానికి తోడు గవర్నర్ కాన్వాయ్!

బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డు ఇప్పటికే అండర్‌పాస్ నిర్మాణ పనులతో ఇరుగ్గా మారి, ప్రయాణికులకు నిత్యం నరకం చూపిస్తోంది. ఇలాంటి రద్దీ సమయంలో ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా, హఠాత్తుగా గవర్నర్ కాన్వాయ్ వెళ్తుందనే నెపంతో పోలీసులు దాదాపు 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు.

Rajasthan Dust Storm : పగలును రాత్రి చేసేసిన ఇసుక తుఫాన్..! వైరల్ వీడియో..!
Rajasthan Dust Storm : పగలును రాత్రి చేసేసిన ఇసుక తుఫాన్..! వైరల్ వీడియో..!

గవర్నర్ ఇంకా హెచ్‌ఏఎల్ (HAL) విమానాశ్రయం నుంచి బయలుదేరకముందే.. కిలోమీటర్ల మేర వాహనాలను నిలిపివేయడం గమనార్హం. ఇదే ట్రాఫిక్ జామ్‌లో సదరు వ్యక్తి తన గర్భిణి భార్యతో కలిసి ఆసుపత్రికి వెళ్తూ చిక్కుకుపోయాడు. వాహనాలు కదిలే పరిస్థితి లేకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో లేకపోవడంతో ఆ భర్త తల్లడిల్లిపోయాడు.

రోడ్డుపై కూర్చుని.. పోలీసులతో వాదన!

ఇస్రో జంక్షన్ సమీపంలోని జీబ్రా క్రాసింగ్‌పై ఆ వ్యక్తి తన వాహనాన్ని ఆపి, రోడ్డుపైనే బైఠాయించాడు. తన భార్య గర్భిణి అని, అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలని, గవర్నర్ ఇంకా విమానాశ్రయం దాటకముందే ట్రాఫిక్ ఎందుకు ఆపారంటూ పోలీసులను నిలదీశాడు. వీఐపీల సౌకర్యానికి ఇచ్చే ప్రాధాన్యతలో కనీసం ఒక్క శాతం కూడా సామాన్య పౌరుల ప్రాణాలకు ఇవ్వరా? అంటూ అతడు చేసిన ఆర్తనాదాలు అక్కడి వాహనదారులను కదిలించాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో @Prajvalprince అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వైరల్ కావడంతో నెటిజన్లు, ప్రముఖులు పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిరసన తీవ్రం కావడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే హోయసల పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఎలాగోలా నచ్చజెప్పడంతో ఆ వ్యక్తి రోడ్డుపై నుంచి లేచి గవర్నర్ కాన్వాయ్‌కి దారి ఇచ్చాడు.

విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు

ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. జీవన్ భీమా నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ విషయమై ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ.. "ఆన్‌లైన్‌లో వస్తున్న ఆరోపణలపై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. అయితే సాధారణంగా 30 నిమిషాల పాటు వాహనాలను నిలిపివేసే అవకాశం చాలా తక్కువ.

బెంగళూరు ట్రాఫిక్ కు డబుల్ చెక్- డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ రయ్ రయ్
బెంగళూరు ట్రాఫిక్ కు డబుల్ చెక్- డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ రయ్ రయ్

హెచ్‌ఏఎల్ విమానాశ్రయం నుంచి సదరు వ్యక్తి నిరసన తెలిపిన జంక్షన్ వరకు ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఒకవేళ విధి నిర్వహణలో పోలీసులు నిజంగానే అంత సమయం వాహనాలను నిలిపివేసి ఉంటే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లు అవసరమే అయినప్పటికీ.. రోగులు, గర్భిణీ స్త్రీల వంటి అత్యవసర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించలేకపోవడంలో ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+