కెసిఆర్‌పై తొడగొట్టాడు.., పప్పుసుద్ద: నారా లోకేష్‌పై రోజా తీవ్రవ్యాఖ్యలు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా గురువారం నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఓ పప్పు సుద్ద అన్నారు. చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. లోకేష్ సత్తా అందరికీ తెలుసునని, ఆయన ఓ పప్పు సుద్ద అన్నారు.
నారా లోకేష్ గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తొడగొట్టారని, ఆ తర్వాత చల్లబడ్డాడని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసు తర్వాత ఏం జరిగిందో తెలుసునని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తెలంగాణలో టిడిపి పరిస్థితి అందరికీ తెలుసునని చెప్పారు.
లోకేష్ దమ్ము, ధైర్యం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు.. ఈ దేశ ప్రజలకు బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. తాము చర్చకు సిద్ధమని లోకేష్ పదేపదే చెబుతున్నారని, మీరు దొంగలు.. ముద్దాయిలు.. మీతో మాకు చర్చ ఏమిటని రోజా కౌంటర్ ఇచ్చారు. లోకేష్‌కు ఎమ్మెల్యేగా గెలిచే సత్తా లేదన్నారు.

తమపై తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. తమ అధినేత జగన్ ఏ తప్పూ చేయలేదని, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నామన్నారు. ప్రజలను నమ్ముకొనే గత ఎన్నికల్లో పోటీ చేశామన్నారు. అవినీతికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు.
ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధం అని టిడిపి నేతలు నేతలు అంటున్నారని.. మీరు దొంగలు, ముద్దాయిలు మీరు చర్చకు రమ్మనడమేంటీ' అన్నారు. సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా అన్నారు. ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఏం నెరవేర్చారని, విభజన చట్టంలో హామీలు ఎందుకు అమలు కావట్లేదని రోజా ప్రశ్నించారు. రాజధాని పేరుతో టిడిపి నేతలు రైతుల పొట్టగొడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications