వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేటి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం - భక్తులకు కీలక సూచనలు..!!

|
Google Oneindia TeluguNews

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం ఆర్ద్రరాత్రి దాటాకి 1.40 గంటల నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించేందుకు నిర్ణయించారు. కైంకర్యాల అనంతరం వేకువజాము 1.45 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే పరిమళ పుష్ఫాలు..విద్యుత్తు దీప కాంతులో శ్రీవారి ఆలయం శోభాయమానంగా వెలుగులీనుతోంది.

నేటి అర్ద్రరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం

నేటి అర్ద్రరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం


వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 5 గంటల వరకు వీఐపీలకు, 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణీ భక్తులకు, 6 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. నేటి నుంచి తిరుమలకు వచ్చే వీఐపీల కోసం ప్రత్యేకంగా శ్రీపద్మావతి గెస్ట్ హౌస్ ప్రాంతంలోని సన్నిధానం, వెంకట కళా నిలయం వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి అక్కడే వసతి, దర్శన పాసులను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసారు. 11వ తేదీ వరకు ఆ ద్వారాలను తెరిచే ఉంచి గతేడాది తరహాలో పదిరోజుల పాటు దర్శనాలు కల్పించనున్నారు. సుమారు 3 నుంచి 4 వేల మంది వివిధ కేటగిరీలకు చెందిన వీఐపీలకు దర్శన ఏర్పాట్లు చేశారు. వీరికి ఆదివారం సాయంత్రంలోగా టికెట్లు మంజూరు చేయనున్నారు.

సామాన్య భక్తులకు దర్శనం ఇలా

సామాన్య భక్తులకు దర్శనం ఇలా


అదే విధంగా ఇప్పటికే ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టీటీడీ అధికారులు టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను ఈ రోజు మధ్నాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలో తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా భక్తులకు జారీ చేయనున్నారు. ఒక ప్రాంతంలో రద్దీ అఽధికంగా ఉంటే మరో ప్రాంతానికి భక్తులు సులువుగా చేరుకునేలా ప్రతి కౌంటర్‌ వద్ద క్యూఆర్‌ కోడ్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ క్యూఆర్‌ కోడ్‌ను సెల్‌ఫోన్‌లో స్కాన్‌ చేస్తే ఆయా ప్రాంతాలకు గూగుల్‌ రూట్‌ మ్యాప్‌ను పొందవచ్చు. క, వైకుంఠ ద్వార దర్శనం జరిగే పది రోజుల పాటు వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసారు. ఎక్కువ మంది సాధారణ భక్తులకు అవకాశం కల్పించే ఉద్దేశంతో వీఐపీ దర్శనాలను పరిమితం చేసారు.

నేటి నుంచి సర్వదర్శనం టికెట్లు జారీ

నేటి నుంచి సర్వదర్శనం టికెట్లు జారీ


ఇప్పటికే రెండున్నార లక్షల టోకెన్లను సాధారణ భక్తులకు విడుదల చేసిన టీటీడీ. నేడు ప్రారంభం కానున్న భక్తులకు మరో నాలుగున్నార లక్షల టోకెన్లు విడుదల చేయనున్నారు. ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. రథసప్తమి వేడుకలు జనవరి 28న తిరుమలలో వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు మలయప్పస్వామి వి విధ వాహనాలపై మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్య జయంతిని పురస్కరించుకుని ఆ రోజు తెల్లవారుజామున 5.30 నుంచి ఉదయం 8 గంటల నడుమ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో ఊరేగనున్నారు. మొత్తం ఏడు వాహనాలపై గోవిందుడు కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

English summary
Srivari Vaikunt aDwara Darshanam begin early hours of Monday, TTD made all arrangments for VAikunta Ekadasi at Tirumala
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X