ఇవి మార్ఫింగ్ చేసినవా, పవన్! మీరూ ఉన్నారు: గల్లా జయదేవ్, పవన్-జగన్-మోడీలపై కార్టూన్

అమరావతి: 2014లకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన ప్రసంగాలను మార్ఫింగ్ చేసినట్లుగా బీజేపీ నేతలు చెప్పడంపై టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. దీనిపై ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను సూటిగా ప్రశ్నించారు.

నాడు ప్రధాని మోడీ ఏపీకి హామీ ఇచ్చినప్పుడు ఆ మీటింగులో మీరు (పవన్ కళ్యాణ్)కూడా ఉన్నారని, ఏపీకి హోదా చాలా ముఖ్యమని, మీరు ప్రధాని మోడీని ప్రశ్నించేందుకు ఇది సరిపోదా, మోడీ తన హామీలపై వెనక్కి తగ్గలేదా, మీరు కూడా అందుకు సాక్షి, ఈ వీడియోలను మార్ఫింగ్ చేశారా అని గల్లా ప్రశ్నించారు.

అందరి వద్ద మోడీ ప్రసంగం వీడియోలు ఉన్నాయి

అందరి వద్ద మోడీ ప్రసంగం వీడియోలు ఉన్నాయి

నాలుగేళ్ల క్రితం తిరుపతిలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్న సమయంలో ఆయనకు సమీపంలో తన తల్లి గల్లా అరుణ కుమారి కూడా కూర్చున్నారని, అన్ని మీడియా ఛానళ్ల వద్ద మోడీ ప్రసంగం ఫుటేజీలు ఉన్నాయని గల్లా జయదేవ్ గుర్తు చేశారు.

ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు

ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు

అంతకుముందు కూడా గల్లా జయదేవ్ ట్విట్టర్ ద్వారా జనసేనానికి ప్రశ్నలు సంధించారు. తాను గుంటూరులో ఉంటున్నానని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా తెలంగాణలోనే ఓటరుగా ఉన్నారని, అమరావతికి అథితిగా వచ్చి వెళ్తారని ఎద్దేవా చేసారు. ఏఫీకి నెలకు రెండుసార్లు అతిథిగా వచ్చే ఆయన ఇంకా హైదరాబాదులో ఓటరుగా ఉన్నారని పేర్కొన్నారు. పవన్ ట్వీట్టర్ ద్వారా స్పందిస్తుంటారు. ఆయన దారిలోనే గల్లా జయదేవ్ జనసేనానికి ప్రశ్నలు సంధిస్తున్నారు.

మోడీ - ప్రత్యేక హోదాపై పోస్ట్

మరోవైపు, గల్లా జయదేవ్ ప్రత్యేక హోదా విషయంలో మోడీ, బీజేపీ తీరుపై ట్విట్టర్లో వరుస పోస్టులు పెడుతున్నారు. 2014 ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత 2015లో ప్యాకేజీ ఇస్తామని చెప్పారని, ఇప్పుడు ఆ రెండింటిని పక్కన పెట్టారని అర్థం వచ్చేలా ఓ ఫోటో పోస్ట్ చేశారు.

ప్రధానమంత్రి గారూ అంటూ మరో ట్వీట్

ప్రధానమంత్రి గారు! ఏపీ ప్రజలు తెరవెనుక ఏం జరుగుతుందో తెలుసుకోనంత ఫూల్స్ కాదని, త్వరలో మీ మాస్క్‌లు తొలిగిపోతాయని మరో ట్వీట్ చేశారు. అందులో మొదట మోడీతో పవన్, జగన్, చంద్రబాబు పోరాడుతున్నట్లుగా, తర్వాత ఫోటోలు చంద్రబాబు పోరాడుతుంటే మోడీని కాపాడేవారిగా పవన్, జగన్‌లను చూపించిన కార్టూన్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+