'జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలు, పోలీసులను బెదిరించినా చర్యలేవి'

అనంతపురం: అనంతపురంలో జేసీ సోదరులు (ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి)ల దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతోందని అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు.

జిల్లాలోని ఎస్పీ కార్యాలయం వద్ద వారు నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసనకారులు ఎస్పీ కార్యాలయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నాలు చేశారు.

All party leaders fires at JC brothers

వారిని పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రిలో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసులను ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించినా చర్యలు తీసుకోవడం లేదని అఖిలపక్షం నేతలు ఆరోపించారు.

విలేకరులపై కూడా వారు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షం నాయకులు ప్రెస్ క్లబ్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇందులో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+