బొత్సకు హ్యాండ్: ఆటోలో ఇంటికెళ్లిన మొయిలీ(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పైన మంత్రుల బృందం(జివోఎం) అఖిల పక్షం బుధవారంతో ముగిసింది. మొదటి రోజైన మంగళవారం మజ్లిస్, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు, బుధవారం సిపిఐ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పాయి. జివోఎంకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది.
ఇప్పటికే అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న జివోఎం ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని తీసుకునేందుకు ఆయనను ఢిల్లీకి రావాల్సిందిగా సూచించింది. దీంతో కిరణ్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు జివోఎంతో భేటీ అయి మరోసారి సమైక్యగళం వినిపించనున్నారు. విడిపోతే వచ్చే సమస్యలను ఆయన ప్రస్తావిస్తారు.
కాగా సిపిఐ, తెరాస, బిజెపిలు తెలంగాణకు అనుకూలంగా చెప్పాయి. సీమాంధ్రకు న్యాయం కూడా చేయాలని బిజెపి, సిపిఐలు చెప్పాయి. కాంగ్రెసు నుండి వెళ్లిన ఇద్దరు రెండు వాదనలు వినిపించారు. సమైక్యమే నినాదం అన్న మజ్లిస్ విభజన జరిగినందున హైదరాబాదును యూటి చేస్తే ఒప్పుకునేది లేదని చెప్పింది. ఇక జగన్ పార్టీ, సిపిఎంలు సమైక్యగళం వినిపించాయి.

జివోఎం 1
బుధవారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను మంత్రుల బృందం(జివోఎం)కు నివేదించిన విషయాలను చెబుతున్న వట్టి వసంత్ కుమార్.

జివోఎం 2
బుధవారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జివోఎం భేటీకి రానందుకు తెలుగుదేశం పార్టీ పైన మండిపడుతున్న తెరాస ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు.

జివోఎం 3
బుధవారం మంత్రుల బృందం(జివోఎం) సభ్యుడు జైరామ్ రమేష్ అఖిల పక్ష భేటీ కోసం వస్తున్న దృశ్యం. నిన్న వైయస్సార్ కాంగ్రెసు, సిపిఎంలు తమ అభిప్రాయం చెప్పాయి.

జివోఎం 4
బుధవారం మంత్రుల బృందం(జివోఎం) సభ్యుడు సుశీల్ కుమార్ షిండే అఖిల పక్ష భేటీ కోసం వస్తున్న దృశ్యం. నిన్న వైయస్సార్ కాంగ్రెసు, సిపిఎంలు తమ అభిప్రాయం చెప్పాయి.

జివోఎం 5
బుధవారం మంత్రుల బృందం(జివోఎం)తో భేటీ అయిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న సిపిఎం నేతలు రాఘవులు, జూలకంటి రంగారెడ్డి.

జివోఎం 6
ఢిల్లీలో మంత్రుల బృందం (జివోఎం) అఖిల పక్ష భేటీ నేపథ్యంలో తెరాస అధినేత కెసిఆర్‌తో కలిసి ఢిల్లీకి వచ్చిన పెద్దపల్లి ఎంపి వివేక్.

జివోఎం 7
బుధవారం మంత్రుల బృందం(జివోఎం)తో భేటీ అయిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మైసూరా రెడ్డి.

జివోఎం 8
బుధవారం మంత్రుల బృందం(జివోఎం) సభ్యులు జైరామ్ రమేష్, వీరప్ప మొయిలీలో అఖిల పక్ష భేటీ అనంతరం బయటకు వస్తున్న దృశ్యం. నిన్న వైయస్సార్ కాంగ్రెసు, సిపిఎంలు తమ అభిప్రాయం చెప్పాయి.

జివోఎం 9
బుధవారం మంత్రుల బృందం(జివోఎం) సభ్యుడు సుశీల్ కుమార్ షిండే అఖిల పక్ష భేటీ అనంతరం బయటకు వస్తున్న దృశ్యం. నిన్న వైయస్సార్ కాంగ్రెసు, సిపిఎంలు తమ అభిప్రాయం చెప్పాయి.

జివోఎం 10
బుధవారం మంత్రుల బృందం(జివోఎం) సభ్యుడు నారాయణ స్వామి అఖిల పక్ష భేటీ కోసం వస్తున్న దృశ్యం. నిన్న వైయస్సార్ కాంగ్రెసు, సిపిఎంలు తమ అభిప్రాయం చెప్పాయి.

జివోఎం 11
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో మంగళవారం భేటీ అయిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్, ఉద్యోగ సంఘాల నాయకులు.

జివోఎం 12
మంగళవారం మంత్రుల బృందం(జివోఎం)తో భేటీ అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతున్న మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ.

జివోఎం 13
మంగళవారం మంత్రుల బృందం(జివోఎం)తో భేటీ అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పక్కన హరిబాబు, నాగం జనార్ధన్ రెడ్డిలు.

జివోఎం 14
మంగళవారం మంత్రుల బృందం(జివోఎం) సభ్యుడు ఎకో ఆంటోని అఖిల పక్ష భేటీ కోసం వస్తున్న దృశ్యం. మంగళవారం మజ్లిస్, బిజెపి, తెరాస, కాంగ్రెసు, సిపిఐలు అభిప్రాయం చెప్పాయి.

జివోఎం 15
మంగళవారం మంత్రుల బృందం(జివోఎం)తో భేటీ అనంతరం బయటకు వచ్చి జైరామ్ రమేష్, ఆజాద్ తదితరులతో మాట్లాడుతున్న సిపిఐ నారాయణ.

జివోఎం 16
మంగళవారం మంత్రుల బృందం(జివోఎం)తో భేటీ అనంతరం బయటకు వచ్చి జైరామ్ రమేష్, ఆజాద్ తదితరులతో మాట్లాడుతున్న సిపిఐ నారాయణ.

జివోఎం 17
మంగళవారం మంత్రుల బృందం(జివోఎం)తో భేటీ అనంతరం బయటకు వచ్చి జైరామ్ రమేష్, ఆజాద్ తదితరులతో మాట్లాడిన నారాయణ పిసిసి అధ్యక్షుడితో కరచాలనం చేస్తూ..

జివోఎం 18
మంగళవారం మంత్రుల బృందం(జివోఎం)తో భేటీ అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ.

జివోఎం 19
మంగళవారం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ.

జివోఎం 20
మంగళవారం కేంద్ర మంత్రుల బృందం(జివోఎం)కు తమ అభిప్రాయం చెప్పేందుకు వెళ్తున్న తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కె కేశవరావు.

జివోఎం 21
మంగళవారం మంత్రుల బృందం(జివోఎం)తో భేటీ అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ.

జివోఎం 22
మంగళవారం మంత్రుల బృందం(జివోఎం)తో భేటీ అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతున్న తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కె కేశవరావు.

జివోఎం 23
ఢిల్లీ పెద్దలను కలిసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్.

జివోఎం 23
కేంద్ర మంత్రుల బృందం సభ్యులు వీరప్ప మొయిలీ, సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్‌లు అఖిల పక్ష సమావేశం సమయంలో మాట్లాడుతున్న దృశ్యం.

జివోఎం 24
బుధవారం ఢిల్లీలో మంత్రుల బృందం(జివోఎం) సమావేశం అనంతరం ఇంధనం ఆదా కోసం సిఎన్‌జి ఆటోలో ఇంటికి వెళ్తున్న కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ. ప్రతి బుధవారం తాను ప్రజా రవాణా వ్యవస్థలో పని చేస్తానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications