వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో గెలిచేదెవరు - అన్ని సర్వేలు తేల్చింది అదే : అక్కడే అసలు ట్విస్టు..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. సీఎం జగన్ తో సహా ప్రధాన పార్టీల అధినేతలు వచ్చే ఎన్నికల పైనే పోకస పెట్టారు. ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎవరికి వారు తాము ఎంచుకున్న సంస్థల ద్వారా క్షేత్ర స్థాయిలో సర్వేలు చేయిస్తున్నారు. నివేదికల ఆధారంగా చర్యలు ప్రారంభించారు. ఇదే సమయంలో జాతీయ సంస్థలు లోక్ సభ ఎన్నికల కోసం సర్వేలు చేస్తున్నాయి. అదులో ప్రధానంగా ఇప్పటి వరకు మూడు ప్రముఖ సంస్థలు తమ సర్వే అంచనాలను వెల్లడించాయి.

సర్వేలన్నీ వైసీపీకే అనుకూలంగా

సర్వేలన్నీ వైసీపీకే అనుకూలంగా

దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో ఏపీలోని 25 లోక్ సభ స్థానాలపైనా ప్రజాభిప్రాయం సేకరించారు. అందులో భాగంగా.. ఈ మూడు సంస్థల సర్వేల ఫలితాలు వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీకి లోక్ సభలో 22 స్థానాలు ఉన్నాయి. ఇండియా టీవీ సర్వే ప్రకారం వైసీపీకి 19 సీట్లు వస్తాయని అంచనా. ఇండియా టూడే సర్వేలో వైసీపీకి 48 లోక్ సభ సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఇక, తాజాగా వెల్లడైన టైమ్స్ నై సర్వేలో వైసీపీకి 17- 23 సీట్లు వస్తాయని వెల్లడించారు. అదే సమయంలో ఇండియా టూడే సర్వేలో జాతీయ స్థాయిలో ఉత్తమ సీఎంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ 5వ స్థానంలో ఉన్నారు. ఈ సర్వేల పైన వైసీపీ నేతలు సంతోషంతో ఉన్నారు.

టీడీపీలో భిన్న వాదన

టీడీపీలో భిన్న వాదన

దీని ద్వారా తాము తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని తేలుతోందని చెబుతున్నారు. కానీ, టీడీపీ మాత్రం ఈ సర్వేల పైన మౌనంగా ఉంది. ఆ పార్టీ నేతలు ఎటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు. టీడీపీ నేతల్లో అంతర్గతంగా మరో చర్చ సాగుతోంది. తాము అధికారం లో ఉన్న సమయంలోనూ సర్వేలు తమకు అనుకూలంగా వచ్చాయని..కానీ, అసలు ఫలితాలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సర్వేల ఫలితాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలుగా అంచనా వేసారని.. ఎన్నికల సమయానికి పరిస్థితుల్లో మార్పులు వస్తాయని సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు వైసీపీ నేతలు ఈ మూడున్నారేళ్ల కాలంలో పాలన చూసిన తరువాత వచ్చిన ఫలితాలు ఇలా ఉంటే.. వచ్చే ఏడాదిన్నార కాలంలో ఇంకా ప్రజలకు దగ్గరయ్యే నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.

పొత్తులతో లెక్కలు మారిపోతాయంటూ

పొత్తులతో లెక్కలు మారిపోతాయంటూ

ఈ ఏడాదిన్నార కాలంలో ప్రజలకు దూరం అయ్యే విధంగా ఏ నిర్ణయం ఉండదని చెబుతున్నారు. దీని ద్వారా 2019 నాటి పరిస్థితిని ఇప్పటి వరకు నిలబెట్టుకున్నామని.. 2024లోనూ అవే ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఇప్పుడు పొత్తులు లేని సమయంలో ఈ సర్వేలు చేసారని.. పొత్తులు ఖరారైతే ప్రజాభిప్రాయంలో.. అంచనాల్లోనూ మార్పులు ఉంటాయనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దీంతో.. ఇప్పుడు వైసీపీలో ధీమా కనిపిస్తుండా.. టీడీపీ మరింత లోతుగా ప్రజాభిప్రాయ సేకరణ.. చేపట్టాల్సిన చర్యల పైన క్షేత్ర స్థాయిలో భిన్నా కోణాల్లో సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తోంది.

English summary
All the surveys results in favour of YCP fo AP Loksabha seats, now interesting debated begins in the political circles on these surveys
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X