Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసెంబ్లీకి జగన్ హాజరు వేళ కీలక నిర్ణయం..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రజల ముందుకు రానుంది. రేపు (సోమవారం) నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. దీంతో, కూటమి ప్రభుత్వం సైతం పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతోంది. ప్రతిపక్షంలో ఏకైక పార్టీగా వైసీపీ ఉంది. దీంతో, జగన్ పార్టీ వ్యూహాలకు ధీటుగా అధికార పార్టీ సన్నద్ధం అవుతోంది.

అసెంబ్లీకి సిద్దం
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజున గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఈ నెల 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పైన చర్చకు నిర్ణయించారు. రేపు (సోమవారం) గవర్నర్ ప్రసం గం పూర్తయిన తరువాత బీఏసీ సమావేశమైన సమావేశ షెడ్యూల్.. అజెండా ఖరారు చేయను న్నారు. 28న బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. జగన్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, గవర్నర్ ప్రసంగం .. అదే విధంగా బడ్జెట్ ప్రవేశ పెట్టే వేళ జగన్ సభకు వస్తారని చెబుతున్నారు. కాగా, సభ్యుడిగా జగన్ కు అవకాశం వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇటు వైసీసీ గవర్నర్ ప్రసంగం వేళ నిరసన వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

All set for AP Assembly Budget Sessions speaker key directions for officials

జగన్ ప్రణాళికలు
జగన్ సభలో చర్చ సమయంలో ఉంది.. మైకు కోరితే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సభకు వస్తున్న జగన్ ప్రభుత్వం తనకు అవకాశం ఇవ్వలేదనే విమర్శల కు అవకాశం లేకుండా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే సమయంలో అసెంబ్లీ నిర్వహణ సమయంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోక లు, ప్రవేశాలపై ఉన్న నిబంధనల్నికట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. భద్రతా కారణాల రీత్యా పాస్​లు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించను న్నారు. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్ లతో పాస్​లు జారీ చేస్తున్నారు. ఎవరు ఏ గేటు నుంచి ఎంట్రీ అవ్వాలో ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.

రాకపోకలపై
అసెంబ్లీ గేట్ 1 నుంచి మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతి ఉంటుంది. గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఇస్తారు. గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తూ బులెటిన్ జారీ చేసారు. మండలి చైర్మన్, స్పీకర్, సీఎంలు వచ్చి వెళ్లే కారిడార్​లోకి ఇతరులెవ్వరికీ అనుమతి లేదని స్పష్టం చేసారు. నాలుగో గేట్ గన్ పాయింట్ మినహా భద్రతా సిబ్బందిని అనుమతించేది లేదని వెల్లడించారు. మంత్రులు, సభ్యుల పీఏలను అవసరం మేరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.అసెంబ్లీలోని మీడియా పాయింట్ మినహా ఇతర చోట్ల మీడియా సమావేశాలు నిర్వహించొద్దని సభ్యులకు, మంత్రులకు సూచనలు జారీ చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+