ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం వేళ - గందరగోళానికి చెక్, కీలక మార్పులు..!!

ఏపీ ప్రభుత్వం మరో పథకం ప్రారంభానికి సిద్దమైంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి మార్గ దర్శకాలను ఖరారు చేసారు. ఏ బస్సుల్లో పథకం అమలు చేస్తారు.. జీరో ఫేర్ టికెట్ జారీ పైన విధి విధానాలను ప్రకటించారు. విద్యార్ధినులకు ఈ పథకం అమలు కానుంది. అదే సమయంలో బస్సుల నిర్వహణ పైన ఉన్న గందరగోళానికి చెక్ పెట్టేలా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పలు మార్పులను అమల్లోకి తెచ్చింది. ఈ సాయంత్రం ఈ పథకం ప్రారంభం కానుంది.

ఈ సాయంత్రం సీఎం చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమరావతిలో ప్రారంభించనుంది. ఈ సమయంలో ఆర్టీసీ కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. పథకం ఏయే బస్సుల్లో అమలవుతుందనేది స్పష్టంగా తెలిసేలా, ఆయా బస్సులపై ఆర్టీసీ అధికారులు స్టిక్కర్లు అతికిస్తున్నారు. తద్వారా మహిళా ప్రయాణికులు గందరగోళానికి గురవకుండా ఉండేందుకు చూస్తున్నారు. ఆకుపచ్చ రంగు ఉండే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులను సులువుగా గుర్తుపట్టొచ్చు. అయితే ఎక్స్‌ప్రెస్, నాన్‌స్టాప్, ఇంటర్‌స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌లు చూడటానికి ఒకేలా ఉంటాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనే మహిళలు ఉచితంగా ప్రయాణించాల్సి ఉంటుంది.

all-set-for-free-bus-for-women-in-the-state-apsrtc-ready-with-special-buses

కాగా, నాన్‌స్టాప్, ఇంటర్‌స్టేట్‌ బస్సుల్లో తప్పనిసరిగా టికెట్‌ తీసుకోవాలి. ఈ మూడు బస్సులు కూడా ఒకేలా ఉండటంతో మహిళలు గందరగోళానికి గురవుతారు. దీనికి చెక్‌పెట్టేలా ఉచితప్రయాణం ఉన్న బస్సులపై 'స్త్రీశక్తి పథకం' వర్తిస్తుందనేలా కొన్ని చోట్ల స్టిక్కర్లు అతికించారు. మహిళలకు 5 రకాల బస్సుల్లో మహిళలకు జీరో ఫేర్‌ టికెట్లు జారీ చేస్తారు. అయితే ఇప్పటికే విద్యార్థినులు స్టూడెంట్‌ పాస్‌లు, మహిళా ఉద్యోగులు వంటివారు నెలవారీ, సీజనల్‌ పాస్‌లు తీసుకొని ఉంటారు.

ఇటువంటి వారి పాస్‌ల గడువు ఉన్నంతవరకు వీరికి జీరోఫేర్‌ టికెట్ల జారీ ఉండదు. పాస్‌ల గడువు ముగిశాక బస్సుల్లో జీరోఫేర్‌ టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారుజ మహిళా ప్రయాణికులతో సంస్థ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని అధికారులు మహిళలకు జీరో ఫేర్‌ టికెట్లు కోసం గుర్తింపు కార్డులుగా ఆధార్, ఓటరు, రేషన్ కార్డులను పరిగణిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+