Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కల్యాణ్ సమరశంఖం, ఇక జనం మధ్యనే - ఆట మొదలైంది..!!

జనసేనాని పవన్ ఇక జనం మధ్యనే ఉండనున్నారు. ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. పవన్ కల్యాణ్ యాత్రకు "జనసేన వారాహి విజయ యాత్ర" అని పేరు పెట్టారు. ఈ రోజు అన్నవరం సత్యదేవుని దర్శనం అనంతరం పవన్ రాజకీయ యాత్ర లాంఛనంగా ప్రారంభం కానుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. యాత్రతో పాటు, సభలు కూడా నిర్వహించనున్నారు. ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ పవన్ యాత్రతో మరింత రాజకీయ వేడి పెరగనుంది.

ఎన్నికల సమరశంఖం:జనసేనాని పవన్ ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. ఎన్నికలకు ముందే తన ప్రచార రధం వారాహితో ప్రజాక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ ఉదయం అన్నవరం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ప్రతీ నియోజకవర్గానికి రెండు రోజుల సమయం కేటాయించాలని నిర్ణయించారు. స్థానికంగా ప్రజల నుంచి సమస్యలు తెలుసుకోవాలనికి ప్రజా వాణి నిర్వహించనున్నారు.

All set for Pawan Kalyan Varahi Yatra to launch from Annavaram, target 2024 Elections

ప్రజాసమస్యలపై పోరాటం,అధికార వైసీపీ అవినీతి, అక్రమాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యంగా సాగనున్న యాత్ర జిల్లాలో నాలుగు నియోజకవర్గాల మీదుగా జరగనుం ది. పర్యటనలో కత్తిపూడి, ఉప్పాడ బస్టాండ్‌ సెంటర్‌, సర్పవరం మొత్తం మూడు బహిరంగ సభల్లో పవన్‌కళ్యాణ్‌ ప్రసంగించనున్నారు. కీలక సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయడంలో భాగంగా ఏదొక ప్రాంతా న్ని పరిశీలించనున్నారు. యాత్రకు పోలీసు శాఖ అనుమతి ఇచ్చింది. ఎక్కడా సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

షెడ్యూల్ ఇలా:ఇప్పటికే పవన్ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను పార్టీ ప్రకటించింది. ఈ రోజు నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. వారాహి యాత్ర విజయ వంతం అయ్యేందుకు పార్టీ ఏడు ప్రత్యేక కమిటీలు కూడా నియమించింది. కాగా వారాహి యాత్రలో పవన్‌ ప్రసంగం ఏస్థాయిలో ఉండబోతుంద నేది పార్టీ శ్రేణులు భారీ అంచనాలు వేస్తున్నాయి.

పవన్‌ యాత్ర ద్వారా జిల్లాలో తమ బలం ఏస్థాయిలో ఉందో చూపించాలని నేతలు పట్టుదలగా ఉన్నారు. అందుకో సం అన్నవరంనుంచి బహిరంగ సభ జరిగే కత్తిపూడివరకు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో నింపేశారు. 16న పిఠాపురంలో, 18న కాకినాడలో, 20న ముమ్మడివరంలో, 21న అమలాపురంలో, 22న పి గన్నవరంలో అదే రోజు మల్కిపురంలో, 23న నర్సాపురంలో పవన్ యాత్ర, సభ జరిగేలా ప్రణాళికలు సిద్దం చేసారు. పవన్‌ అన్నివర్గాలకు చేరువయ్యేలా వ్యూహం రూపొందించుకున్నార ని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సత్తా చాటేలా:అన్ని సామాజికవర్గాల ప్రజలు, నేతలు, నిపుణులతో చర్చలు జరిపి వారి మనోభిప్రాయాలు పవన్‌ తెలుసుకోనున్నారు. పవన్ చాలా కాలం తరువాత జనంలోకి వస్తున్నారు. 2019 ఎన్నికల తరువాత రాష్ట్రంలో పర్యటనలు చేసినా..కార్యక్రమాల్లో పాల్గొన్నా..ఇప్పుడు దాదాపు 15 రోజుల పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని పవన్ నిర్ణయించారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రయోగాలు ఉండవని పవన్ తేల్చి చెప్పారు.

అందులో భాగంగా సినిమాలకు పవన్ బ్రేక్ ఇచ్చారు. రెండు వారాల పాటు ప్రజలతో మమేకం కానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేడర్ లో ఉత్తేజం నింపేదుందకు..పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంలో పవన్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ యాత్రలో ప్రధానంగా అధికార వైసీపీని లక్ష్యంగా చేసుకొని పవన్ యాత్ర..ప్రసంగాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలపైన ఆశలు పెట్టుకున్న పవన్..ఈ యాత్ర ద్వారా తన సత్తా చాటేందుకు సిద్దమయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+