వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కౌంట్ డౌన్ బిగిన్ - కొత్త జిల్లాల ప్రకటకు రంగం సిద్దం : ఏపీకి కొత్త రూపు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ కొత్త రూపు సంతరించుకుంటోంది. ఇందుకు కొద్ది గంటలే సమయం ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్దమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏ క్షణమైనా అధికారికంగా గజెట్ జారీకి సమయం సమీపిస్తోంది. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలోనే జగన్ తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఆ హామీ మేరకే రాష్ట్రంలో సీఎస్ నాయకత్వంలో అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసారు. రెండు నెలల క్రితం కొత్త జిల్లాల ఏర్పాటు పైన ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసారు.

ప్రభుత్వానికి 16 వేలకు పైగా అభ్యర్ధనలు

ప్రభుత్వానికి 16 వేలకు పైగా అభ్యర్ధనలు


దీని నుంచి ప్రజలు..రాజకీయ పార్టీలు..సంస్థల నుంచి దాదాపుగా 16 వేల అభ్యంతరాలు - సూచనలు - సలహాలు అందాయి. వీటి పైన అధ్యయనం చేసిన తరువాత తుది ముసాయిదా ప్రకటన పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. తొలుత ఉగాది నాడే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని భావించినా.. ముహూర్త బలంతో దానిని ఈ నెల 4వ తేదీకి మార్చారు. ఏప్రిల్‌ 4వ తేదిన సరిగ్గా ఉదయం 9:05 గంటల నుంచి 9:45 గంటల మధ్య నూతన జిల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఈ నిర్ణయం ప్రకారం.. 4వ తేదీ నుంచి రాష్ట్రంలో 26 జిల్లాలు ఉనికిలోకి రానున్నాయి. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చ్యువల్ విధానంలో కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు.

అధికారులు - ఉద్యోగుల కేటాయింపు పూర్తి

అధికారులు - ఉద్యోగుల కేటాయింపు పూర్తి


కొత్త జిల్లాలకు కావాల్సిన కార్యాలయాలు సైతం సిద్దమయ్యాయి. కొత్త జిల్లాల కు కలెక్టర్లు..ఎస్పీలు.. జాయింట్ కలెక్టర్ల నియామకం దాదాపుగా పూర్తయింది. ఇక, అధికారిక ఉత్తర్వులు జారీ చేయటమే మిగిలింది. ఉద్యోగుల విభజన..కేటాయింపు దాదాపుగా పూర్తి చేసారు. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను కేటాయించారు. వీరంతా నాలుగో తేదీ నుంచి విధుల్లో హాజరు కానున్నారు. ఇక, ప్రభుత్వానికి అందిన సూచనల్లో జిల్లా కేంద్రం మార్చాలని, జిల్లా పేరు మార్చాలని, తమ ప్రాంతానికి కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని.. ఇలా చాలా డిమాండ్లు వినిపించాయి. వీటన్నింటినీ పరిశీలించి తుది ముసాయిదా సిద్దం చేసారు.

ఏపీ ఇక 26 జిల్లాల రాష్ట్రంగా..కొత్త రూపు

ఏపీ ఇక 26 జిల్లాల రాష్ట్రంగా..కొత్త రూపు


వరుసగా జిల్లాల ఏర్పాటు..అధికారుల నియామకం.. ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసేందుకు రంగం సిద్దమైంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతోపాటు విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు.. హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం.. అధికారులందరితో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడే అవకాశం ఉంది. ఇక, ఇప్పటి వరకు 13 జిల్లాల ఏపీ..మరి కొద్ది గంటల్లో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా కొత్త రూపుతో కనిపించనుంది.

English summary
All set for Publish official Gazzete on nes districts and Revenu division in the state, which effect from 4th April.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X