అమరావతిలో అరుదైన ఘట్టం - శ్రీవారి భక్తులకు గోల్డెన్ ఛాన్స్..!!

రాజధాని అమరావతి కేంద్రంగా అరుదైన ఘట్టం చోటు చేసుకోనుంది. అమరావతి కేంద్రంగా శ్రీనివాస కల్యాణం కు భారీ ఏర్పాట్లు సిద్దం అవుతున్నాయి. రాజధాని పనులు తిరిగి ప్రారంభం వేళ శ్రీనివాస కళ్యాణం నిర్వహణకు నిర్ణయించారు. రాజధాని గ్రామాల ప్రజలకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ప్రత్యేకం గా కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. టీటీడీ పాలనా యంత్రాంగం అమరావతిలో మొహరించింది.

అమరావతి వేదికగా
అమరావతి రాజధాని వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వేంటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన సాయంత్రం 6:30 నుండి 8:30 గంటల వరకు నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణానికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు శ్రీనివాస కళ్యాణం అనంతరం స్వామి వారి దివ్య ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. మొదటి విడతగా రూ. 30 వేల కోట్లతో పనులు ప్రారంభించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో శ్రీనివాస కళ్యాణం జరపనుండటం ఆనందంగా ఉందన్నారు.

all-set-for-srinivasa-kalyanam-in-amaravathi-on-15th-march-in-a-big-way

భారీ ఏర్పాట్లు
శ్రీనివాస కళ్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి జిల్లా యంత్రాం గంతో సమన్వయం చేసుకొని విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో శ్యామల రావు తెలిపారు. ఈ క్రమంలో భాగంగా శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల నుండి అర్చక స్వాములు, వేద పండితులు, వారితోపాటు మంగళ ధ్వని, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకా లు విచ్చేస్తున్నారు. ⁠కళ్యాణ వేదిక నిర్మాణంతో పాటు 27 వేల మంది భక్తులు కళ్యాణాన్ని తిలకిం కు వీలుగా సదుపాయాలు కల్పిస్తున్నామని ఈవో వివరించారు. ⁠గుంటూరు, విజయవాడ తదితర ముఖ్యమైన ప్రాంతాలలో ఫ్లెక్సీ బోర్డులు, హోర్డింగులు ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.

ప్రత్యేక అలంకరణ
⁠శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంతో పాటు, కళ్యాణ వేదిక పరిసర ప్రాంతాలలో విద్యుత్ దీపా కరణలు ఏర్పాటు చేశాం. వేదిక చుట్టూ భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు ఎల్ఈడి టీవీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ⁠శ్రీనివాస కళ్యాణంలో పాల్గొనే భక్తులందరికీ శ్రీవారి సేవకుల సహకారంతో మంచినీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ తో స్వామివారి ఆలయంతో పాటు కళ్యాణ వేదికను శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+