ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు - మార్గదర్శకాలు..!!
ఏపీలో ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్దమైంది. ఈ సారి బదిలీలతో పాటుగా పదోన్నతులను ఒకే సారి చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు తుది కసరత్తు జరుగుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభం లోగానే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయ సం ఘాలతో చర్చలు జరిగాయి. అనేక సూచనలు వచ్చాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు బదిలీలు - పదోన్నతుల మార్గదర్శకాలు సిద్దం చేసింది. జీవో 117కు ప్రత్యామ్నాయంగా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జీవో విడుదల చేయనుంది.
ఉపాధ్యాయ బదిలీలకు ఏపీ పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. సోమ లేదా మంగళవారం బదిలీల షెడ్యూలు విడుదలకు తుది కసరత్తు కొనసాగుతోంది. ఈసారి బదిలీలు, టీచర్ల పదోన్న తులను ఒకేసారి చేపట్టాలని నిర్ణయించారు. ఇందు లో భాగం గా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నిర్వహించారు. జీవో 117కు ప్రత్యామ్నా యం, పదోన్నతులు, బదిలీలపై సంఘాల నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. అలాగే ప్రభుత్వ విధానాన్ని వారికి వివరించారు. సర్వీసు పాయింట్లను ఏడాదికి 0.5 నుంచి 1కి పెంచాలని సంఘాలు కోరగా ఈ ఏడాదికి కుదరదని తేల్చేశారు. అలాగే కొత్తగా ఏర్పాటుచేసే మోడల్ ప్రె మరీ స్కూళ్లలో మిగులు స్కూల్ అసిస్టెంట్లను ప్రధానోపాధ్యాయులుగా నియమిస్తా మని చెప్పారు.

కాగా, ఈసారి బదిలీల్లో నెగటివ్ పాయింట్లు కూడా ఉంటాయని, విధులకు అనధికారికంగా గైర్హాజరైతే నెలకు ఒక పాయింట్ చొప్పు న గరిష్ఠంగా పది నెగటివ్ పాయింట్లు కేటాయిస్తారని పేర్కొన్నారు. అయితే.. ఉన్నత పాఠశాలల్లో టీచర్లు, విద్యార్థుల నిష్పత్తి 1:40గా మార్చాలని నోబుల్ టీచర్స్ సంఘం నేతలు కోరారు. అలాగే రేషనలైజేషన్‌కు కటాఫ్ తేదీని మార్చాలని ఓ ప్రకటనలో కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏప్రిల్‌లో డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి బడుల్లో చేర్చారని, కానీ మార్చి 31 తేదీని పోస్టుల కేటాయింపునకు కటాఫ్ తేదీగా తీసుకున్నారని, దీనివల్ల పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా పోస్టులు రాలేదని వివరించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం షెడ్యూల్ విడుదలకు తుది కసరత్తు చేస్తోంది. ఎవరికీ ఇబ్బంది లేకుండా బదిలీలు.. పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేస్తామని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications