TTD: బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు గుడ్ న్యూస్ - 1.30 లక్షల దర్శన టికెట్లు..!!
Tirumala: బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు అయింది. బ్రహ్మోత్సవాలకు ఈ రోజు రాత్రి 7 నుండి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. సెప్టెంబర్ 18వ తేదీ సోమవారం ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి.
సామాన్య భక్తులకు ప్రాధాన్యత
బ్రహ్మోత్సవాల వేళ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆన్‌లైన్‌లో 1.30 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు సర్వదర్శనం భక్తులకు 24 వేల ఉచిత దర్శన టికెట్లు టీటీడీ అందించనున్నట్లు తెలిపారు. 2 లక్షల మంది భక్తులు వీక్షించేలా బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశామన్నారు.

సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 22న గరుడ సేవ కారణంగా తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశామని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ ఈవో కోరారు. ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు.
నేడు అంకురార్పణ
ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కాంక్షించడంతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యమైన ఆశీస్సులను భక్తులందరికీ అందించేందుకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. ఈ నెల 22న గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ సేవ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. ఇక, బ్రహ్మోత్సవాల వేళ బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించబడవు. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే అనుమతిస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
22న గరుడ సేవ ప్రత్యేకం
భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబరు 22న గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశారు. సెప్టెంబరు 26న చక్రస్నానం రోజున విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. శ్రీవారి పుష్కరిణి స్నానం మోక్షదాయకం కావున ఒకేసారి అందరూ పుష్కరిణి స్నానానికి ప్రయత్నించవద్దని, సంయమనంతో వ్యవహరించి స్నానమాచరించాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది.
రేపు సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది. 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications