విశాఖ గర్జిస్తోంది - లక్షలాది మంది ఏకమై : సీఎం జగన్ నిర్ణయానికి మద్దతుగా..!!
అక్టోబర్ 15. సాగర తీరం విశాఖ నగరం గర్జిస్తోంది. అధికార వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతుగా లక్షలాది మంది ఏకం అవుతున్నారు. ముక్తకంఠంతో విశాఖను పరిపాలనా రాజధాని చేయాలని నినదిస్తున్నారు. రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నా..రాజకీయాలకు అతీతంగా ఈ గర్జన నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విశాఖలో పరిపాలనా రాజధాని డిమాండ్ కు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటైంది. జేఏసీ రేపు (శనివారం) విశాఖ నగరంలో వికేంద్రీకరణకు మద్దతుగా గర్జనకు పిలుపునిచ్చింది. నగర వ్యాప్తంగా గర్జన ఫ్లెక్సీలు- హోర్డింగ్ లు దర్శనమిస్తున్నాయి.
నగరంలో గర్జనలో భాగంగా ఎల్ఐసీ సర్కిల్ నుంచి బీచ్ రోడ్ వరకు దాదాపు 3.5 కిలో మీటర్ల మేర ర్యాలీ కొనసాగనుంది. దాదాపుగా లక్ష మంది వరకు ప్రత్యక్షంగా ఈ ర్యాలీ పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ జేఏసీలో భాగస్వాము లయ్యారు. పలు జేఏసీలు మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ కోల్పోయిన ఆంధ్ర ప్రాంత వాసుల ఆవేదన ఎప్పటికీ మర్చి పోలేమని..తిరిగి అటువంటి పరిస్థితి రాకూడదంటే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మూడు ప్రాంతాల్లోనూ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారని ఏపీ మంత్రులు వివరిస్తున్నారు. రాజకీయంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. ఇప్పుడు రాజధాని వ్యవహారం ఆ ప్రాంత ప్రజల సెంటిమెంట్ గా మారుతోంది.

దీనికి సామాన్య ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఇదే సమయంలో రాజకీయంగా ప్రతిపక్షాల కార్యక్రమాల నిర్వహణ - పర్యటనలను వైసీపీ నేతలు తప్పు బడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇదే సమయానికి జనసేన అధినేత పవన్ విశాఖలో పర్యటన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాము ఏ ప్రాంతానికి..ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో నెలకొన్న ఆర్దిక పరిస్థితులతో కొత్తగా రాజధాని కోసం వేల కోట్లు ఖర్చు చేసే పరిస్థితి లేదని వివరిస్తున్నారు. విశాఖ లాంటి నగరంలో రాజధాని కోసం కొంత మొత్తంలో ఖర్చు చేస్తే సరి పోతుందని..ఉత్తరాంధ్రలో భవిష్యత్ లో అభివృద్ధికి దోహదం చేస్తుందని వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్. .టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు.
మూడు ప్రాంతాల అభివృద్ధే మాధ్యేయం: వైవీ సుబ్బారెడ్డి#YVSubbareddy #TTDChairman #ApThreeCapitals #AmaravatiCapital #OneIndiaTelugu pic.twitter.com/Y59XxHWsqd
— oneindiatelugu (@oneindiatelugu) October 14, 2022
ఎవరికో వ్యతిరేకంగా ఈ గర్జన జరగటం లేదని.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను వెల్లడించేందుకు వేదికగా ఈ ర్యాలీ ఉంటుందని వివరించారు. విశాఖ ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధాని అవుతుందని సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. ఇక, నగరంలో ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. అటు మంత్రులు - వైసీపీ శ్రేణులు గర్జన ర్యాలీకి మద్దతుగా పాల్గొనాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications