ఎమ్మెల్సీ పోలింగ్ వేళ కీలక పరిణామాలు - కూటమికి పరీక్ష..!!
ఏపీలో ఎమ్మెల్సీ పోరు ఉత్కంఠ పెంచుతోంది. రెండు గ్రాడ్యుయేట్.. ఒక టీచర్ ఎమ్మెల్సీ నియోజ కవర్గ ఎన్నికలకు పోలింగ్ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్య మెజార్టీ తో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమికి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. తొమ్మిది నెల ల పాలన పైన క్షేత్ర స్థాయి మూడ్ ఈ ఎన్నికల్లో స్పష్టం కానుంది. ముందుగానే కూటమి అభ్యర్దుల ను ఖరారు చేసింది. వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీలో లేదు. పీడీఎఫ్ నుంచి కూటమి గట్టి పోటీ ఎదు ర్కొంటోంది. దీంతో.. నేడు జరిగే ఎన్నికల పైన రాజకీయంగా ఉత్కంఠ కనిపిస్తోంది.
కూటమికి ప్రతిష్ఠాత్మకం
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఉభయ గోదావరి, కృష్ణ - గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం పోలింగ్ 8 గంటలకు ప్రారంభ మై సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. ఈ మూడు నియోజవర్గాల్లో 6,84,593మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో తూర్పు, పశ్చిమ గోదావరి గ్రా డ్యుయేట్ నియోజకవర్గంలో 3,14,984మంది, కృష్ణ, గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3,47,116మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ఉపాధ్యాయ నియోజకవర్గంలో 22,493మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

హోరా హోరీ పోరు
ఈ మూడు ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికలు దాదాపు వంద అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతుం డటంతో రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది. 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ఈ ఎన్నికల కోసం ముందస్తుగానే తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి నేతలను అలర్ట్ చేసారు. పవన్ సైతం కూటమి అభ్యర్ధులకు మద్దతివ్వాలని కోరారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థులను నిలుపలేదు. ఇక్కడ ఏపీటీఎఫ్ తరఫున బరిలో ఉన్న సిటింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు మద్దతు ప్రకటించింది. వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. బహిరంగంగానూ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు.
చివరి వరకు పోరాటం
సార్వత్రిక ఎన్నిక ల అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. పట్టభద్రుల స్థానాల్లో తలపడుతున్న ఇద్దరు టీడీపీ అభ్యర్థుల అభ్యర్థుల గెలుపు కోసం మూడు పార్టీలకు చెందిన మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉన్నా ఆ పార్టీ మద్ద తు దారులు పీడీఎఫ్ కు అనుకూలంగా ఓట్ వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ హోరా హోరీగా ఉన్నట్లు గ్రౌండ్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. చివరి నిమి షం వరకు ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు కొనసాగాయి. దీంతో, ఈ ఎన్నికలు రాష్ట్రం లో రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి. మార్చి 3న కౌంటింగ్ జరగనుంది.
-
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ?












Click it and Unblock the Notifications