Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకేష్ కు ప్రమోషన్ - 2019లో ఇలాగే, కూటమిలో కీలక మలుపు..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. దీంతో, రాజకీయంగా కొత్త నిర్ణయాలకు టీడీపీ అధినాయకత్వం సిద్దం అవుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ తొలి మహానాడుకు భారీగా ఏర్పాట్లు చేసారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడు వేదికగా కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు. టీడీపీలో నారా లోకేష్‌కు కీలక పదవి అప్పగించేందుకు మహానాడు వేదికగా నిలవనుంది. ప్రభుత్వంలో ప్రమోషన్‌కు సమయం ఉండటంతో.. ముందుగా పార్టీలో ప్రమోషన్ దాదాపు ఖరారైంది.

మహానాడు వేదికగా
కడప వేదికగా మూడు రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. ఇందు కోసం భారీగా ఏర్పాట్లు చేసారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న వేళ మహానాడులో తీసుకునే రాజకీయ నిర్ణయాల పైన ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ బాధ్యతలను పార్టీ సీనియర్లకు అప్పగించారు. కాగా, మంత్రి లోకేష్‌కు పార్టీలో - ప్రభుత్వంలో ప్రమోషన్ ఇవ్వాలని కొంత కాలంగా పార్టీ నేతల నుంచి డిమాండ్ వస్తోంది. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ పైన వివాదం కొనసాగింది. లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే టీడీపీ నేతల డిమాండ్ పైన జనసేన నేతలు విభేదించారు. దీంతో, ఈ అంశం ఎవరూ ప్రస్తావన చేయవద్దని టీడీపీ ఆదేశించటంతో ఆ చర్చ ఆగిపోయింది.

all-set-to-announce-nara-lokesh-as-tdp-working-president-in-mahanadu

లోకేష్ కు పట్టం
కాగా, ఇప్పుడు పార్టీలో కీలక బాధ్యతల పైన డిమాండ్ వినిపిస్తోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి(వర్కింగ్‌ ప్రెసిడెంట్‌)గా ఆయనకు బాధ్యతలు అప్పగించాలని టీడీపీ శ్రేణుల నుంచి అధిష్ఠానంపై పెద్దఎత్తున ఒత్తిడి వస్తోంది. పార్టీ అధినేతగా - సీఎం బాధ్యతల్లో చంద్రబాబు బిజీగా ఉండటంతో పార్టీ నిర్వహణ ఇక లోకేష్‌కు అప్పగించాలనే చర్చ వినిపిస్తోంది. 2014-19 కాలంలో పార్టీని విస్మరించిన కారణంగానే 2019 ఎన్నికల్లో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వంపైనే దృష్టి పెడితే పార్టీ దెబ్బతింటుందని, పార్టీ కార్యకలాపాలకు కూడా నిర్ణీత సమయం కేటాయించాలని సూచిస్తున్నారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి కచ్చితంగా సమయం కేటాయిస్తామని ఆయన చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు అది కూడా సాధ్యం కావడం లేదు.

మారుతున్న పరిస్థితులు
క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్లో వేగంగా మార్పు కనిపిస్తోంది. పార్టీ పైన దృష్టి పెట్టకపోతే 2014- 2019 అనుభవాలు పునరావృతమవుతాయని సీనియర్‌ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో, పార్టీ నుంచి సరికొత్త ప్రతిపాదన వస్తోంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేయాలని జిల్లాల నుంచి వస్తున్న డిమాండ్‌. దీని పైన చంద్రబాబు ఆలోచన ఏంటనేది వెల్లడి కావాల్సి ఉంది. కడపలో మూడ్రోజులపాటు జరిగే మహానాడులో ఈ అంశంపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ నేతలు మాత్రం లోకేష్‌కు కొత్త బాధ్యతలు ఖాయమని చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+