జూనియర్ ఎన్టీఆర్ అనుచరులంతా వైసీపీలోకి
జూనియర్ ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా నందమూరి కుటుంబంలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తాత వర్థంతి రోజు కావడంతో జూనియర్ ఎన్టీఆర్ , కల్యాణ్ రామ్ ఇద్దరూ ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. ఆ సమయంలో అభిమానులు ఎన్టీఆర్‌ను ఉద్దేశించి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ భారీ ఫ్లెక్సీలను కూడా అభిమానులు ఏర్పాటు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ , కల్యాణ్ రామ్‌లు వెళ్లిన కొద్దిసేపటికే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని తన తండ్రికి నివాళులు అర్పించారు. ఈ సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసిన బాలయ్య..ఒకింత అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడున్న ఫ్లెక్సీలను తొలగించాలని తన అనుచరులకు ఆదేశించారు.

దీంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడ నుంచి తొలగించడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి. ఇదిలా ఉంటే హరికృష్ణ మరణం తరువాత ఆయన కుటుంబానికి నందమూరి, నారా కుటుంబానికి దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. బాలకృష్ణ మొదటి నుంచి కూడా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను దూరం పెడుతూనే వస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాడన్ని బాలకృష్ణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎన్టీఆర్ టీడీపీలోకి ఎంట్రీ ఇస్తే.. తన కొడుకు నారా లోకేష్ రాజకీయ భవితవ్యం అంధకారం అవుతుందని భావించే ..ఎన్టీఆర్ రాకను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని మాటలు టీడీపీలోనూ వినిపిస్తున్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఈ ఇద్దరి అన్నదమ్ములు నుంచి కనీస స్పందన కరువైంది.
దీంతో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌పై ఘాటుగానే విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. బాలకృష్ణ స్పందిస్తూ ..''బ్రో ఐ డోంట్ కేర్'' అని సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ అనుచరులంతా కూడా టీడీపీకి దూరం అవుతున్నారు. మొదటగా కొడాలి నాని టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు.

హరికృష్ణ కుటుంబానికి కొడాలి నాని వీరవిధేయుడనే పేరుంది. కొడాలి నానికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిందే జూనియర్ ఎన్టీఆర్. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని చంద్రబాబును ఒప్పించి మరి కొడాలి నానికి ఎన్టీఆర్ టికెట్ ఇప్పించారు. అలాంటి కొడాలి నాని టీడీపీ వ్యతిరేక పార్టీ అయిన వైసీపీలో చేరి అందరికి షాక్ ఇచ్చారు. ఈ సమయంలో ఎన్టీఆర్ చెబితేనే కొడాలి నాని వైసీపీలోకి వెళ్లారనే కామెంట్స్ కూడా తెర మీదకు వచ్చాయి.
దీనిపై జూనియర్ ఎన్టీఆర్ మీడియా సమావేశం నిర్వహించి మరి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ మరో అనుచరుడైన వల్లభనేని వంశీ సైతం టీడీపీకి గట్టి షాకే ఇచ్చారని చెప్పాలి. 2019 ఎన్నికల్లో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆయన జగన్ పార్టీకి అనుకూలంగా మారిపోయారు. అటు కొడాలి నాని .. ఇటు వల్లభనేని వంశీ కానీ ఇద్దరికి రాజకీయ జీవితం కల్పిచింది జూనియర్ ఎన్టీఆరే.

అలాంటిది వీరిద్దరు ఆయనకు చెప్పకుండా పార్టీ మారుతారంటే నమ్మే పరిస్థితి లేదని టీడీపీ నాయకుల వాదన. ఇక ఎన్టీఆర్ సొంత మామ నార్నే శ్రీనివాసరావు సైతం గత ఎన్నికల్లో వైసీపీలో చేరి ఆ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. తాజాగా ఎన్టీఆర్‌కు ఇష్టమైన దర్శకుడు వివి. వినాయక్ సైతం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
అటు వైసీపీ అధిష్టానం సైతం వివి. వినాయక్‌కు టికెట్ ఇవ్వడానికి సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇలా జూనియర్ ఎన్టీఆర్ అనుచరులంతా టీడీపీని వీడటంపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా టీడీపీకి హ్యాండ్ ఇచ్చి.. వైసీపీలో చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది తాత్కలికమా లేక జూనియర్ ఎన్టీఆర్ మాస్టర్ స్కెచో ఎవరికీ అర్థం కావడం లేదు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications