• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబుకు రివర్స్: బీజేపీ మంత్రుల రాజీనామా? మిస్టర్ సీఎం.. విష్ణు సంచలనం, గల్లాకు కౌంటర్

|
  BJP Ready To End Alliance With TDP

  అమరావతి: ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం ఒక్కటొక్కటిగా నెరవేరుస్తున్నప్పటికీ మిత్రపక్షం తెలుగుదేశం తమపై దాడి చేస్తోందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదని ఏపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆదివారం విజయవాడలోని హోటల్ ఐలాపురంలో బీజేపీ నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే.

  వచ్చే నెల 14న పవన్ భారీ సభ?: మోడీపై అవిశ్వాసం.. టీడీపీ-వైసీపీలకు గట్టి షాక్!

  ఈ సందర్భంగా బీజేపీ నేతలు టీడీపీపై నిప్పులు చెరిగారు. కేంద్రం ఒక్కటొక్కటిగా హామీలు నెరవేరుస్తున్నప్పటికీ మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇక ఊరుకునేది లేదని బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారు. అవసరమైతే చంద్రబాబు కేబినెట్ నుంచి తప్పుకోవాలని బీజేపీ నిర్ణయించిందని తెలుస్తోంది.

  తప్పు మీదే.. తేల్చండి! ఏపీకి పెండింగులో ఈ మూడే: బాబుకు హరిబాబు కౌంటర్

  చంద్రబాబుకు ముందే షాక్

  చంద్రబాబుకు ముందే షాక్

  ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చకుంటే మార్చి 6వ తేదీన కీలక నిర్ణయం తీసుకుంటామని టీడీపీ హెచ్చరిస్తూ వస్తోంది. ఇద్దరు కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలతో రాజీనామా చేయించే యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, అంతకుముందే మేల్కొన్న బీజేపీ.. తాము హామీలు నెరవేరుస్తున్నప్పటికీ ఆరోపణలు చేస్తుండటంతో టీడీపీ కంటే ముందే వారు రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు.

  ప్యాకేజీని సరిగా వినియోగించుకోవడం లేదు, ప్రతిపక్ష పాత్ర

  ప్యాకేజీని సరిగా వినియోగించుకోవడం లేదు, ప్రతిపక్ష పాత్ర

  ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. హోదాకు బదులు ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని చంద్రబాబు ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేకపోయిదని విమర్శించారు. పైగా తమపైకి నెపం నెట్టివేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వం నుంచి తక్షణమే తాము బయటకు వచ్చేయాలని భావిస్తున్నామని, ఈ క్రమంలో తమ మంత్రులు మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస్‌లు రాజీనామా సమర్పించాలని తీర్మానించారని, కొద్ది రోజుల్లో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పారు. దీని ఆమోదానికి అధిష్టానంపై ఒత్తిడి తెస్తామన్నారు.

  సీడీల రూపంలో ప్రచారం

  సీడీల రూపంలో ప్రచారం

  గడిచిన నాలుగేళ్లలో టీడీపీ చేసిన అన్యాయాలను సీడీల రూపంలో ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. సీడీల రూపకల్పన కోసం ఏబీవీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

  చేతులు జోడించి అడిగిరు.. హరిబాబు వర్సెస్ లక్ష్మీపతి

  చేతులు జోడించి అడిగిరు.. హరిబాబు వర్సెస్ లక్ష్మీపతి

  బీజేపీ పదాదికారుల సమావేశంలో హరిబాబు, పార్టీ నేత లక్ష్మీపతిరాజాలకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. టీడీపీని మొదటి నుంచి కట్టడి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కంభంపాటితో వాగ్వాదానికి దిగారు లక్ష్మీపతి. పార్టీ బలపడకుండా కొందరు నేతలు పక్కదారి పట్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పార్టీని బతికించాలని లక్ష్మీపతి చేతులు జోడించి అడిగారు. సీనియర్ నేతలు మాణిక్యాల, పురంధేశ్వరి, సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు తదితరులు ఆయనను సముదాయించారు.

  ఐదు నిమిషాల్లో రాజీనామా

  ఐదు నిమిషాల్లో రాజీనామా

  ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలపై టీడీపీ నేతల విమర్శలు సహించలేకపోతున్నామని కొందరు బీజేపీ నేతలు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆలోచిద్దామని హరిబాబు వంటి నేతలు సూచించగా.. ఇప్పటికే వారు బీజేపీకి తీవ్ర నష్టం చేస్తున్నారని, మాణిక్యాల రావు, విష్ణులు అన్నారు. మంత్రులు రాజీనామా చేయాలని బీజేవైఎం నేత చెప్పగా.. పార్టీ ఆదేశిస్తే ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తానని మాణిక్యాల రావు అన్నారు. రాజీనామాపై అరగంట పాటు సమావేశంలో చర్చ జరిగిందని తెలుస్తోంది. కాగా, మంత్రి కామినేని శ్రీనివాస్ ముందే సమావేశం నుంచి వెళ్లిపోయారు.

  సంక్షేమ పథకాల మొత్తాలను రెవెన్యూ లోటులో కలపడమా

  సంక్షేమ పథకాల మొత్తాలను రెవెన్యూ లోటులో కలపడమా

  బీజేపీ నేతల సమావేశం అనంతరం ఆ పార్టీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షం టీడీపీ దాడిని తిప్పికొట్టేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామన్నారు. సంక్షేమ పథకాల మొత్తాలను రెవెన్యూ లోటులో కలపడం సరికాదన్నారు. ప్రజలకు అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.

  మిస్టర్ ప్రైమినిస్టర్.. మిస్టర్ చీఫ్ మినిస్టర్.. విష్ణు సంచలనం

  మిస్టర్ ప్రైమినిస్టర్.. మిస్టర్ చీఫ్ మినిస్టర్.. విష్ణు సంచలనం

  ప్రజల కోసం తామే ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని విష్ణు కుమార్ రాజు అన్నారు. ఏపీ భాజపా అధ్యక్షుడు హరిబాబును ఓ మంత్రి జెంటిల్‌మెన్‌ కాదని వ్యాఖ్యానించడం సరికాదని మండిపడ్డారు. మంత్రి జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అని సంబోధించి ఏదో ఘనకార్యం సాధించినట్లు కొందరు భావిస్తున్నారని గల్లా జయదేవ్‌ను ఉద్దేశించి అన్నారు. లోకసభలో మిస్టర్ ప్రైమినిస్టర్ అంటూ మాట్లాడిన విషయం తెలిసిందే. తమకు మిస్టర్‌ చీఫ్‌ మినిస్టర్‌ అనే కుసంస్కారం లేదన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that BJP Andhra Pradesh unit has passed a resolution requesting its ministers to resign from Chandrababu Naidu cabinet. Kamineni Srinivas Rao and Manikyal Rao are in Chandrababu cabint from BJP. This may end to the alliance between BJP and TDP.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more