ఉపాసన సీమంతానికి హాజరైన అల్లు అర్జున్
ప్రస్తుతం మెగా కుటుంబం అంతా ఫుల్ జోష్ లో ఉంది. జులైలో ఉపాసనకు డెలివరీ డేట్ ఇచ్చారు. దీంతో వారంతా ఆరోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల స్నేహితుల సమక్షంలో ఉపాసన దుబాయ్‌లో బేబీ షవర్ వేడుక చేసుకున్నారు. అదే వేడుకను చిరంజీవి నివాసంలోనూ చేసుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్‌లో ఈ ఫంక్షన్ నిర్వహించారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అల్లు అర్జున్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఉపాసనతో దిగిన ఫొటోలను బన్నీ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. తనకు ఎంతో ఆనందంగా ఉందంటూ ఉపాసనకు శుభాకాంక్షలు చెప్పారు. ''సో హ్యాపీ ఫర్ మై స్వీటెస్ట్ ఉప్సీ'' అని క్యాప్షన్ రాశారు. సానియా మీర్జా, సుస్మితతో పాటు ఉపాసన, రామ్ చరణ్ స్నేహితులు కూడా హాజరయ్యారు. ఈ ఫొటోలను చూసిన అల్లు - మెగా ఫ్యామిలీల అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి అభిమానాన్ని కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు.

ఇక ఇటీవల ఉపాసన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన ఆహారపు అలవాట్లు, డ్రెస్సింగ్ గురించి వివరించారు. తన బిడ్డకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని, శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మెటర్నటీ దుస్తులు ధరించడంలేదని, తనకు సౌకర్యంగా ఉండేవాటినే ధరిస్తున్నానని, ఇలా కనిపించడాన్ని చాలా గొప్పగా భావిస్తున్నానని తెలిపారు. ప్రెగ్నెన్సీ అనేది ఒక వేడుకలా ఉండాలని, ఇదొక గొప్ప ప్రయాణమని, దీన్ని తాను ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు.
మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి దూరం పెరిగిందంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజుకు అల్లు అర్జున్ శుభాకాంక్షులు కూడా తెలియజేయలేదు. ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు అందుకొన్నందుకు కూడా ఎటువంటి శుభాకాంక్షలు తెలియజేయలేదు. దీంతో అల్లు అర్జున్ కు, రామ్ చరణ్ మధ్య విభేదాలున్నాయని, అవి బయటకు తెలియడంలేదంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఉపాసన సీమంతానికి హాజరైన అల్లు అర్జున్ ఆ పుకార్లన్నింటినీ కొట్టేసినట్లైంది.












Click it and Unblock the Notifications