ఆంధ్రా కాశ్మీర్ లంబసింగిలో...అల్లూరి సీతారామరాజు పార్కు;30 ఎకరాల్లో!

విశాఖపట్టణం: ఆంధ్ర కాశ్మీర్‌ లంబసింగిలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్‌ కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ తెలిపారు. అల్లూరి సీతారామరాజు పార్కును 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తామని చెప్పారు.

ఆదివారం ఆయన లంబసింగి ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే పర్యాటక రంగం పరంగా లంబసింగిని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. విశాఖ జిల్లాలో పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలించేందుకు గాను రావత్ పర్యటన జరుపుతున్నారు.

లంబసింగిలో అల్లూరి సీతారామరాజు పార్కు నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులను రావత్ ఆదేశించారు. అదే పార్కులో పలువురు స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. శీతాకాలంలో అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో లంబ సింగి ఆంధ్రా కాశ్మీర్ గా గుర్తింపు పొందిందని, అందువల్ల పర్యాలకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారని అన్నారు. ఇక్కడ పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే వేసవి విడిదిగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని, తద్వారా టూరిస్ట్ ల సంఖ్య ఇంకా పెరిగి అభివృద్దికి దోహదపడుతుందని తెలిపారు.

Alluri sitarama raju park in lambasingi: SS Rawat

ప్రభుత్వ పరంగా,శాఖా పరంగా ఇక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలను రావత్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి కాఫీ సాగుచేస్తున్న గిరిజన రైతులతో మాట్లాడారు. కాఫీకి ప్రభుత్వం కల్పిస్తున్న గిట్టుబాటు ధరలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కాఫీ రైతులకు ఐటీడీఏ అందిస్తున్న సహాకారంపై గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు వ్యవసాయపరంగా వివిధ రకాల పంటల సాగుతో పాటు ఉద్యానవనశాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని లాభసాటి పంటలను చేపట్టాలన్నారు. ఈ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన యాపిల్‌ సాగు విజయవంతమైతే గిరిజనులు కాఫీతో పాటు యాపిల్‌ను కూడా సాగు చేసుకోవచ్చన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+