ఏపీలో జియో జోరు- ఒకేసారి వంద టవర్లను ప్రారంభించిన జగన్

అమరావతి: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన జియో మొబైల్ నెట్‌వర్క్ వ్యవస్థ రాష్ట్రంలో మరింత మెరుగుపడింది. గ్రామాలకు సైతం 4జీ జియో సేవలు అందనున్నాయి. ఏజెన్సీ ఏరియాలు, మారుమూల గ్రామాలకు సైతం నెట్ వర్క్‌ను విస్తరించింది రిలయన్స్ జియో యాజమాన్యం. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 100 జియో టవర్లను నిర్మించింది.

వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఒకేసారి వంద జియో టవర్ల నెట్ వర్క్‌ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. వర్చువల్ విధానంలో వాటన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చారు వైఎస్ జగన్. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా జియో 4జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్టయింది.

jagan

ఈ కార్యక్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్‌, రిలయెన్స్ జియో ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వంద జియో టవర్లను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు వైఎస్ జగన్.. రిలయన్స్ జియో ప్రతినిధులను అభినందించారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. జియో 4జీ సేవలు అందుబాటులోకి రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న టెలిమెడిసిన్ సేవలు మరింత మెరుగుపడతాయని భావిస్తోన్నారు. మొబైల్ నెట్ వర్క్ బలోపేతం కావడం గ్రామస్థాయిలో పౌర సేవలను కూడా మరింత వేగవంతం చేయొచ్చని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+