వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి కోరితే ఆమె కాదనలేదు: పీసీసీ ఎంపికలో ఇదీ జరిగింది!

కాంగ్రెస్ రాజ్యసభసభ్యుడిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీని వీడుతారని ఇటీవల విస్తృత ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు కాంగ్రెస్ పార్టీ పీసీసీ సభ్యునిగా నియమించిందని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ రాజ్యసభసభ్యుడిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీని వీడుతారని ఇటీవల విస్తృత ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు కాంగ్రెస్ పార్టీ పీసీసీ సభ్యునిగా నియమించిందని తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారంలో ఒకరి త్యాగం చిరంజీవిని కాంగ్రెస్ పార్టీలోనే ఉండేట్లు చేసిందనే వాదన వినిపిస్తోంది.

చిరంజీవి కోరితే..

చిరంజీవి కోరితే..

పశ్చిమగోదావరి జిల్లా, కొవ్వూరు బ్లాక్ వన్ నుంచి పీసీసీ సభ్యునిగా నియమించడానికి చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఒప్పించారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో పీసీసీ సభ్యురాలిగా కొనసాగుతున్న కాంగ్రెస్ మహిళా విభాగ నేత అమరరజహా‌ను తప్పించారు. అయితే, ఆమె చిరంజీవి కోరిక మేరకే తప్పుకున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ఏపీ కాంగ్రెైస్ పార్టీలో చిరంజీవి కీలక నేత కావడం, అతనిపై ఉన్న అభిమానంతోనే ఆమె ఒప్పుకున్నారని తెలుస్తోంది.

చిరును బ్రతిమాలారు..

చిరును బ్రతిమాలారు..

కాగా, అక్టోబర్ 10న విజయవాడలో పీసీసీ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఆపై పీసీసీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది. ఈ ఏర్పట్ల నేపథ్యంలో చిరంజీవిని ఎలాగో బ్రతిమాలి మరీ ఈ స్థానానికి ఒప్పించారని సమాచారం.

చిరు ఎంపికపై హర్షం

చిరు ఎంపికపై హర్షం

పైగా చిరంజీవే స్వయంగా కోరడంతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎంపిక చేశామని మరో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అయితే, చిరంజీవి ఎంపికపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలియవచ్చింది. కాగా, ఎలాగోలా చిరంజీవిని కాంగ్రెస్ పార్టీని వీడకుండా చూడటంలో రాష్ట్ర పార్టీ నేతలు సఫలీకృతులయ్యారని తెలుస్తోంది.

అభిమానుల అసంతృప్తి?

అభిమానుల అసంతృప్తి?

అయితే, పలువురు చిరంజీవి అభిమానులు మాత్రం కాంగ్రెస్ పార్టీ చిరు కొనసాగడంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెస్ కొనసాగడంపై అభిమానులకు అంతగా నచ్చడం లేదని తెలుస్తోంది.

English summary
It is said that Amarajaha Besh loses her post for Chiranjeevi as PCC member.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X