రాజధానిపై జీవో: అమరావతి అభివృద్ధికి సీసీడీఎంసీ
హైదరాబాద్: అంధ్రప్రదేశ్ నూతన రాజధాని పేరును అమరావతిగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 2న జరిగిన మంత్రిమండలి రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించిన విషయం తెలిసిందే. కొత్త రాజధాని పరిధిని 375 చదరపు కిలోమీటర్లకు పెంచేందుకు తాజాగా తీర్మానించారు.
నూతన రాజధాని నగర నిర్మాణానికి జూన్ 2న పునాదిరాయి వెయ్యాలని కూడా గతంలోనే ముహూర్తం నిర్ణయం జరిగింది. ఏ కారణం వల్లనైనా ఈ ముహూర్తం తప్పితే, ప్రత్యామ్నాయంగా మరో రెండు తేదీలను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు ఇటీవల తుళ్లూరు మండలం దొండపాడులో వ్యవసాయ భూములను చదును చేయించారు.
అమరావతి అభివృద్ధికి..

రాజధాని అభివృద్ధికి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న రాజధాని నగర అభివృద్ధి, నిర్వహణ కంపెనీకి (సీసీడీఎంసీ) అనుబంధంగా అయిదు ప్రత్యేక ప్రయోజన వాహకాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగర నిర్మాణ పనులు వీటి ఆధ్వర్యంలో జరుగుతాయి. సీసీడీఎంసీ ఏర్పాటుకు మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.
సీఆర్డీఏ మొత్తం రాజధాని ప్రాంతంలో రెగ్యులేటరీ వ్యవహారాల్ని చూస్తుంది. 225 చ.కి.మీ. పరిధిలోని రాజధాని నగరం మాత్రమే సీసీడీఎంసీ పరిధిగా ఉంటుంది. నగర ప్రాంతంలో ప్రాథమిక వసతుల కల్పన, నగర నిర్మాణ వ్యవహారాల్ని ఇది పర్యవేక్షిస్తుంది.












Click it and Unblock the Notifications