రాజధానిగా అమరావతి వేస్ట్.. మంగళగిరి బెస్ట్ .. నిపుణుల కమిటీకి చెప్తా అంటున్న ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే , సీఆర్ డీఏ చైర్మన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలోసంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా మంగళగిరి పేరును ఆయన ప్రతిపాదించారు. ఏపీ రాజధాని అమరావతి కంటే మంగళగిరి బెస్ట్ అన్నారు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి .

తుళ్ళూరు , వెలగపూడి వంటి ప్రదేశాలతో పోల్చి చూస్తే అన్ని రకాలుగా భవన నిర్మాణాలకు మంగళగిరి అనుకూలం అని ఆయన పేర్కొన్నారు. అమరావతి వేస్ట్ అని మంగళగిరి బెస్ట్ అని చెప్పిన ఆయన అందుకు గల కారణాలను కూడా వివరించారు. మంగళగిరి చాలా ఎత్తైన కొండ ప్రదేశం అని , ఇది గుంటూరు, విజయవాడ మధ్య ఉందని చెప్పారు. రాజధాని అమరావతితో పోలిస్తే దూరం కూడా చాలా తక్కువ అని పేర్కొన్నారు. అంతే కాదు జాతీయ రహదారులకు సమీపంలో ఉందని ఆయన పేర్కొన్నారు.దీని వల్ల రావాణా సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఇక మంగళగిరి ముంపుకు గురయ్యే చాన్స్ లేదన్నారు.

Amaravathi waste as capital ... Mangalagiri the Best .. MLA RK says

మంగళగిరిలో సుమారు 10వేల ఎకరాల ప్రభుత్వ స్థలాలు , అటవీ భూములు ఉన్నాయని ఆళ్ళ చెప్పారు. ఇక గతంలో శివరామ కృష కమిటీ నివేదిక అమరావతి రాజధాని నిర్మాణానికి అనుకూలం కాదని ఇచ్చినప్పటికీ గతప్రభుత్వం కమిటీ నివేదిక కు వ్యతిరేకంగా అమరావతిలో నిర్మాణం చేశారని పేర్కొన్నారు. భవిష్యత్ నిర్మాణాలు మంగళగిరిలో చేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళగిరి భారీ నిర్మాణాలకు అనుకూల ప్రాంతం అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ రాజధాని విషయంలో ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ అభిప్రాయం అడిగితే కచ్చితంగా మంగళగిరి పేరును ప్రతిపాదిస్తానని మంగళగిరి ఎమ్మెల్యే, సీఆర్ డీఏ చైర్మన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+