• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీటీడీ వివాదానికి కారణమైన...ఆర్కియాలజీ అధికారి శ్రీలక్ష్మి బదిలీ

By Suvarnaraju
|

అమరావతి:టిటిడిని పురావస్తు శాఖ పరిధిలోకి తేవాలనే సర్క్యులర్‌ జారీతో పెను వివాదానికి కారణమైన ఆర్కియాలజీ అమరావతి సర్కిల్‌ సూపరిటెండెంట్‌ శ్రీలక్ష్మి పై ఎపి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆమెని బెంగుళూరుకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు తెలిసింది.

ఈ నెల ఐదున తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రక్షిత సంపదగా గుర్తించాలని ప్రతిపాదిస్తూ పురావస్తు శాఖ సూపరింటెండెంట్ పేరిట ఒక సర్క్యులర్ జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే శ్రీ లక్ష్మీ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు మరోవైపు భక్తుల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమెను ట్రాన్స్ ఫర్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సర్క్యులర్ లో...ఏముందంటే?...

సర్క్యులర్ లో...ఏముందంటే?...

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రక్షిత సంపదగా గుర్తించాలని పురావస్తు శాఖ ప్రతిపాదిస్తూ ఇందులో భాగంగా ఆలయ చారిత్రక ప్రాధాన్యతాంశాలను పరిశీలించేలా, దాన్ని రక్షిత సంపదగా గుర్తించేలా తమ శాఖ ప్రతినిధులకు సహకరించాలని పురావస్తు శాఖ నుంచి టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు ఒక లేఖ అందింది.

ఆ ప్రసక్తే లేదు...టిటిడి ఈవో

ఆ ప్రసక్తే లేదు...టిటిడి ఈవో

అయితే ఆ లేఖ పై అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున దుమారం రేగగా...తిరుమల శ్రీవారి ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించే ప్రసక్తే లేదని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. తన సర్క్యులర్ పై పెను దుమారం రేగిన నేపథ్యంలో టీటీడీ ఈవోకు పంపిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్టు భారత పురావస్తు శాఖ అధికారిణి శ్రీలక్ష్మి ప్రకటించారు.

సంబంధం లేదు...ఆర్కియాలజీ

సంబంధం లేదు...ఆర్కియాలజీ

మరోవైపు ఆర్కియాలజీ అధికారి శ్రీలక్ష్మీ జారీ చేసిన సర్క్యులర్‌ తో తమకు ఏమాత్రం సంబంధం లేదని పురావస్తు శాఖ వెల్లడించడం గమనార్హం. అయితే కేంద్రమే ఈ ఆదేశాలు జారీ చేయించిందన్న విమర్శలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని జీవీఎల్‌ స్పష్టం చేశారు. ఈ విషయంపై కేంద్ర సాంస్కృతిక శాఖా అధికారులతో మాట్లాడామని, అటువంటి అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. దేవస్థానం నుంచి కేంద్రం జోక్యం కోరితే పరిశీలిస్తారని తెలిపారు. కేవలం రాజకీయ దురుద్ధేశంతో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని జీవీఎల్‌ విమర్శించారు.

అంతా మిస్టరీ...మరి ఎందుకు చేశారు?

అంతా మిస్టరీ...మరి ఎందుకు చేశారు?

అయితే ఎవరి ఆదేశాలు లేకుండా ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారి తాను స్వంతగా ఇలాంటి నిర్ణయం, అదీ టిటిడి వంటి అతి ప్రాముఖ్యమైన గుడికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదనేది అందరికీ తెలిసిన విషయమే. మరైతే శ్రీ లక్ష్మీని ఈ నిర్ణయం తీసుకోమని చెప్పిందెవరనే విషయమై ఆసక్తి నెలకొంది. మరోవైపు శ్రీ లక్ష్మీ జారీ చేసిన సర్క్యులర్ కారణంగా టిటిడి కేంద్రం ఆధీనంలోకి వెళ్లేంత అవకాశం ఉండదని...అందులోని అంశాలు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితిని బట్టి మరోలా అర్థం చేసుకోవడం వల్ల ఇంత దుమారం రేగిందనేది వారి విశ్లేషణ. ఏదేమైనా శ్రీ లక్ష్మీ బదిలీతో ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణుగుతుందా...లేక మరోరకంగా చిలికి చిలికి గాలి వానగా మారుతుందా అనేది ఉత్కంఠగా మారింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

మరిన్ని andhra pradesh వార్తలుView All

English summary
Superintending archaeologist of the Archaeological Survey of India (Amaravati Circle) T Sreelakshmi, who hit the headlines last weekend for sending a letter to the TTD seeking cooperation for a feasibility study to include Tirumala temples in the protected monuments list, has been transferred to Bengaluru.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more