బ్రిటిష్ మ్యూజియంలో అమరావతి: మోడీకి చూపించనున్న చంద్రబాబు

న్యూఢిల్లీ: లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో అమరావతి అమరావతి పేరుతో ఉన్న గ్యాలరీని శంకుస్థాపన రోజున ప్రధాని నరేంద్ర మోడీకి వీడియోలో చూపాలని మంత్రి మండలి శనివారం నాడు నిర్ణయించింది. బ్రిటిష్ మ్యూజియంలో 33ఏ పేరుతో అమరావతి గ్యాలరీ ఉంది.

ఈ విషయాన్ని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి గతంలో రాష్ట్ర ప్రభత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు లేఖ రాశారు. ఇటీవల ప్రధాన కార్యదర్శి లండన్ పర్యటనలో భాగంగా బ్రిటిష్ మ్యూజియాన్ని సందర్శించారు.

అక్కడ అమరావతి గ్యాలరీని చూశారు. చిత్రాలు, వీడియోతో సహా సమాచారాన్ని ప్రధాన కార్యదర్శి శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వివరించారు. అమరావతి స్థూపాలు, బుద్ధుని పాదాలు అక్కడ ఉన్నాయని తెలిపారు.

'Amaravati' in british museum, Chandrababu plans to show Modi

1798లో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్న మెకంజీ ఏపీ ప్రాంతంలో పురాతన వస్తువుల వెలికితీతకు తవ్వకాలు మొదలు పెట్టారు. పందొమ్మిదవ శతాబ్దం అంతటా ఇక్కడి కళాఖండాలను వెలికి తీసే కార్యక్రమం జరిగింది.

రాజధాని కోసం పరుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు

గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద ఏపీ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజధాని కోసం 5కే రన్ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కదిలిరావాలన్నారు.

తెలుగువారి ఘన చరిత్ర ప్రతిబింబించేలా రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తున్నామని, అమరావతికి సంఘీభావంగా ప్రతి మున్సిపాలిటీలోనూ 5కే రన్‌ నిర్వహించాలని కోరారు.

అమరావతి దేవేంద్రుడి రాజధాని అన్నారు. రాజధాని అమరావతిలో అవకాశాలకు ఆకాశమే హద్దు అన్నారు. ఈ నెల 13 నుంచి 22 వరకు శంకుస్థాపన వేడుకలు నిర్వహిస్తామన్నారు. కాగా, మణిపాల్‌ హాస్పటల్‌ నుంచి మంగళగిరి వరకు 5కే రన్‌ కొనసాగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+