అమరావతికి కేంద్రం రూ 15 వేల కోట్లు సాయమా..రుణమా..!?
కేంద్ర బడ్జెట్ ప్రజల ముందుకు వచ్చింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఏపీ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీ విభజన హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. రాజదాని అమరావతికి రూ 15 వేల కోట్ల ఆర్దిక సాయం చేస్తామని వెల్లడించారు. అక్కడే అసలు విషయం కనిపిస్తోంది. అమరావతికి రూ 15 వేల కోట్లు కేంద్రం ఇస్తుందా..అప్పుగా ఇప్పిస్తుందా అనే సందేహం కొనసాగుతోంది. ఎట్టకేలకు దీని పైన స్పష్టత వచ్చింది.
అమరావతికి దక్కిందేంటి
బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసారు. నిర్మలమ్మ చేసిన ప్రకటన పరిశీలించిన నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి నేరుగా సాయం అందిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పకపోవటాన్ని ప్రస్తావిస్తున్నారు. గమనార్హం. మల్టీ లేటరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ద్వారా రూ.15 వేల కోట్ల ఆర్థిక మద్దతు అందిస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారని చెబుతున్నారు.

కేంద్ర ప్రకటన వెనుక
అమరావతికి కేంద్రం రూ 15 వేల కోట్ల సాయం చేస్తుందనే ప్రకటన బయటకు వచ్చింది. దీని పైన ఏపీలోని కూటమి నేతలు హర్షం వ్యక్తం చేసారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. కానీ, ఢిల్లీలోని వైసీపీ నేతలు భిన్నంగా స్పందించారు. రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు గ్రాంటా? లేక అప్పా? అనేది తేల్చాలని ఎంపీ డాక్టర్ గురుమూర్తి డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు భారాన్ని మోపవద్దని ఆయన అన్నారు. ఏపీకి గ్రాంట్ రూపంలోనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అమరావతి కి 15000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటిస్తే
— Ambati Rambabu (@AmbatiRambabu) July 23, 2024
గొప్పలు చెప్పుకుంటున్నారు!
సంపద సృష్టించడం అంటే అప్పులు
తెచ్చుకోవడం అన్నమాట!@ncbn @JaiTDP
రుణంగానే అందనుందా
ఇదే అంశం పైన వైసీపీ నేత అంబటి రాంబాబు ట్వీట్ చేసారు. అమరావతి కి 15000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు. సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట అంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్దిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి వివిధ అభివృద్ధి ఏజెన్సీలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15000 కోట్ల రూపాయల ఇప్పిస్తామని చెప్పుకొచ్చారు. రాబోయే సంవత్సరాల్లో అదనపు నిధులు కూడా అందిస్తామని వివరించారు. బడ్జెట్ డ్రాఫ్టులో నిర్మల ప్రసంగం చూసినా.. వినినా.. ఇది అప్పు అనేది మాత్రం స్పష్టం అవుతోంది. దీని పైన ఇప్పుడు ఎన్డీఏ నేతలు ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications