ఏపీ ప్రభుత్వానికి ఏ మేరకు లాభం?: మూడు దశల్లో 35 ఏళ్ల పాటు రాజధాని నిర్మాణం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అమలు చేసేందుకు సోమవారం సీఆర్డీఏ బిడ్డింగ్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. జులై 18న ప్రారంభమైన ఈ టెండర్ల ప్రక్రియ సెప్టెంబర్ 1వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో సింగపూర్ కన్సార్షియం ప్రతిపాదనలను కూడా సీఆర్డీఏ బహిర్గతం చేసింది.

దీని ప్రకారం రాజధాని నిర్మాణంలో సింగపూర్‌ కన్సార్షియంకు 52, సీఆర్‌డీఏకు 52:48 చొప్పున వాటాలు ఉంటాయి. అయితే రాజధాని నిర్మాణం పూర్తి అయిన తర్వాత వచ్చే ప్లాట్లను విక్రయించాక వచ్చే రాబడిలో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తుందనే విషయాన్ని మాత్రం బహిర్గతం చేయలేదు.

దీనిని మాత్రం సీల్డ్ కవర్‌లో అందించింది. అంతేకాదు అమరావతి డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ప్రతిపాదనలకు గాను రూ.7.5 కోట్లు ఖర్చు అవుతుంది పేర్కొంది. అమరావతి డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో డెవలపర్‌కు ప్రత్యేక హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం మూడు దశల్లో 35 ఏళ్ల పాటు జరగనుంది.

Amaravati development: CRDA invites proposal for works on 1,691 acre

తొలిదశ నిర్మాణం:

తొలి దశ నిర్మాణం పదేళ్ల పాటు జరుగుతుంది. ఇందులో 15,280 హెక్టార్ల భూ విస్తీర్ణంలో జరగనుంది. తొలి దశలోనే భాగంగా పరిపాలనా భవన సముదాయాల నిర్మాణాన్ని నిర్మించనున్నారు. సీడ్‌ డెవల్‌పమెంట్‌ ప్రాంతంలో బిజినెస్‌ పార్క్‌ నిర్మాణం. భారీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు రానున్నాయి. దీంతో పాటు ట్రాన్స్‌పోర్టేషన్‌ హబ్‌ నిర్మాణం జరుగుతుంది.

రెండోదశ నిర్మాణం:
రెండో దశలో 10 నుంచి 20 ఏళ్ల మధ్య 7200 హెక్టార్లలో ప్రభుత్వ నివాస భవనాలు, ప్రభుత్వ భవనాలు, ఇండస్ట్రియల్ క్లస్టర్‌, ఎంఆర్‌టీ నెట్‌వర్క్‌, గేట్‌ వే కమర్షియల్‌ నోడ్‌ ఏర్పాటవుతాయి.

మూడోదశ నిర్మాణం:
మూడో దశలో 20 నుంచి 35 ఏళ్ల మధ్య అమరావతి అభివృద్ధి సుస్థిరత సాధించే దిశగా 16,600 హెక్టార్లలో కృష్ణా నదిపైనా.. నది ద్వీపాలపైనా ఎకో రిసార్ట్స్‌ నిర్మాణం జరుగుతుంది. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లూ వస్తాయి. రెసిడెన్షియల్‌ క్లస్టర్‌లూ వస్తాయి. సీడ్‌ డెవల్‌పమెంట్‌ ఏరియా వాటర్‌ఫ్రంట్‌ క్లస్టర్‌ ఏర్పాటవుతుది.

సీడ్‌ డెవల్‌పమెంట్‌ ప్రాంతంలో ప్రధానంగా నాలుగు నోడ్‌లు ఉంటాయి. ఇందులో ప్రధానమైనది గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌, రెండోది వాటర్‌ ఫ్రంట్‌, మూడోది డౌన్‌‌టౌన్‌, నాలుగోది గేట్‌వే. కాగా, అమరావతి డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్‌, సెంబుకార్ప్‌లు చెరో 50 శాతం పెట్టుబడివాటాలతో ప్రత్యేక జాయింట్‌ వెంచర్‌ కంపెనీగా ఏర్పడ్డాయి. సింగపూర్‌ ఇండియా కార్ప్‌గా ఏర్పడ్డ ఈ సంస్థ 100 శాతం యాజమాన్య సంస్థగా వ్యవహరిస్తుంది.

జాయింట్‌ వెంచర్‌ పద్ధతిలో జరిగే అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోనున్న అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జ్‌ కంపెనీలు, సెమ్‌కార్బ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ సమాన షేర్లు కలిగి ఉంటాయని సీఆర్‌డీఏ పేర్కొంది. సింగపూర్‌ కంపెనీల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే భూమి విలువ ఎకరానికి నిర్దారించిన రూ.4 కోట్ల మొత్తం నిబంధనలకు లోబడి ఉంటుందని, రాబోయే ఐదేళ్ల పాటు ఇదే విధానం కొనసాగించాలని తేల్చిచెప్పింది.

రాజధాని నిర్మాణంలో సీసీడీఎంసీఎల్‌ అనుమతులు తప్పనిసరి

రాజధాని ప్రాంతంలో సింగపూర్‌ కంపెనీలు భవిష్యత్తులో చేపట్టే నిర్మాణాలు తదితర అంశాల్లో 58 శాతం వాటా ఆ కంపెనీలకే ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే కంపెనీల చట్టం-2013లో పేర్కొన్నట్లుగా ఒక సంస్థలో 50 శాతం కన్నా తక్కువ మొత్తంలో షేర్లు కలిగిన వారు ఉనికిని కాపాడుకుంటూ నిర్వహణ బాధ్యతలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుందనే విషయాన్ని ప్రస్తావించింది.

ఈ మొత్తం ప్రక్రియలో పెద్ద మొత్తానికి సంబంధించి కీలకమైన మార్పులకు లోనయ్యే నిర్ణయాలు సింగపూర్‌ కంపెనీలు తీసుకోవాల్సి వస్తే అందుకు తప్పనిసరిగా సీసీడీఎంసీఎల్‌ (క్యాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌) నుంచి అనుమతులు తీసుకోవాలి.

కోర్ క్యాపిటల్‌లో భూముల అమ్మకంపై ఏడీపీదే తుది నిర్ణయం

కోర్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో భూముల అమ్మకం నుంచి, నిర్మాణ ప్రాంతం అమ్మకం వరకు లాంటి నిర్ణయాలను ఏడీపీనే తీసుకుంటుంది. స్విస్‌ చాలెంజ్‌ పద్దతిలో ఎంపికయ్యే ప్రైవేటు భాగస్వామి-ప్రభుత్వం కలిసి అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఏడీపీ)ని ఏర్పాటుచేస్తాయి.

దీంతో కోర్‌ క్యాపిటల్‌లో చేపట్టే నిర్మాణాల్లో దేనిని అమ్మాలన్నా ఏడీపీదే తుది నిర్ణయం. ఈ మేరకు జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇస్తారు. పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించేందుకు నిర్దేశించిన 1691 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల అనుమతులు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇస్తూ రాజధాని నిర్మాణాన్ని ప్రోత్సహించే బాధ్యత రాజధాని నిర్మాణ కంపెనీలే నిర్ణయిస్తాయి.

అంతేకాదు తొలిదశలో ఇచ్చే భూముల ధరను నిర్ణయించే అధికారాన్ని కూడా ఏడీపీకే ఇస్తారు. తర్వాతి రెండు, మూడు దశల్లో కూడా ఏడీపీ నియమించిన యంత్రాంగానికే ధర నిర్ణయించే అవకాశం ఇవ్వనున్నారు. ఏడీపీకి ఇచ్చిన రిజర్వు ధరకంటే తక్కువ ధరకు ఏపీ ప్రభుత్వం ఎవరికైనా భూమిని ఇస్తే ఆ తేడాను ఏపీ ప్రభుత్వం ఏడీపీకి చెల్లించాలనే నిబంధన కూడా ఉంది.

మరోవైపు ఏడీపీకి తగిన సమయంలో ఏపీ ప్రభుత్వం భూమిని ఇవ్వకుంటే... అందుకు ప్రతిగా రూ.కోటిన్నర నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఏదైనా కారణం చేత ఏపీ ప్రభుత్వం వల్ల రద్దు అయితే... అందుకు తగిన పరిహారం ప్రైవేటు భాగస్వామికి చెల్లించాల్సి ఉంటుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Stepping ahead towards construction of the capital city of Amaravati, the AP Capital Region Development Authority (CRDA) invited a Request for a Proposal (RFP) for the development of 6.84 sq. km (1,691 acres) start up area of the city by Public Private Par-tnership (PPP) mode th-rough the Swiss Chall-enge approach under the AP Infrastructure Development Enable (AOIDE) Act, 2001.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి