బడ్జెట్‌పై అమరావతి రైతులు 'దిల్ ఖుష్': టపాసులు పేల్చి సంబరాలు..
రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఆదాయపు పన్ను ఉండదని, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదని జైట్లీ ప్రకటించారు.
విజయవాడ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు లబ్ది పొందనున్నారు. రాజధాని రైతులకు పన్ను మినహాయింపునిస్తూ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఆదాయపు పన్ను ఉండదని, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదని జైట్లీ ప్రకటించారు. దీంతో అమరావతి రైతులు సంబరాల్లో మునిగిపోయారు. టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకుంటున్నారు.

ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామిని వారు గుర్తు చేసుకుంటున్నారు. పన్ను మినహాయింపు ఉంటుందని గతంలో సీఎం చెబితే తాము నమ్మలేదని, కానీ చివరకు ఆయన చెప్పినట్టే జరిగిందని అభిప్రాయపడుతున్నారు.
సీఎం మీద నమ్మకంతోనే తామంతా రాజధానికి భూములు ఇచ్చామని చెబుతున్న రైతులు.. కేంద్రం నిర్ణయంతో సీఎంపై తమ నమ్మకం రెట్టింపయ్యిందని అంటున్నారు. కాగా, రాజధాని కోసం 33వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన 24వేల మంది రైతులు దీని ద్వారా లబ్ది పొందనున్నారు.












Click it and Unblock the Notifications