ఢిల్లీలో అమరావతి హోరు - జాతీయ పార్టీల అభయం : రాజధాని మారదు..!!

రాజధాని ఢిల్లీ వీధుల్లో అమరావతి నినాదం మార్మోగింది. ఢిల్లీలో ని జంతర్‌ మంతర్‌ వద్ద అమరావతి పరిరక్షణ సమితి, రైతు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నినదించారు. టీడీపీ..జనసేన..కాంగ్రెస్..వామపక్షాలు..రఘురామ రాజుతో సహా భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేతలు ధర్నాలో పాల్గొన్నారు.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. పార్లమెంట్ లో అ అంశాన్ని లేవనెత్తనున్నట్లు ప్రకటించారు. విశాఖకు రాజధాని తరలే ప్రసక్తే లేదని నేతలు అమరావతి రైతులకు అభయం ఇచ్చారు. ప్రధాని మోదీ మోసం చేసారని ఆరోపించారు. రైతుల పోరాట స్పూర్తిని నేతలు అభినందించారు.

ప్రధాని మోదీ మోసం చేసారు

ప్రధాని మోదీ మోసం చేసారు

ధరణి కోట టు ఎర్రకోట నినాదంతో అమరావతి రైతులు ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టారు. అమరావతి నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లిన వారంతా జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. పలు పార్టీల నేతలు అమరావతి పోరాటానికి ఢిల్లీ వేదికగా మద్దతు ప్రకటించారు. రాజధాని అమరావతి కోసం యుద్దం చేయటానికే ఢిల్లీకి వచ్చామంటూ అమరావతి పరిరక్షణ సమితి నేతలు తేల్చి చెప్పారు.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నది న్యాయమైన డిమాండ్‌ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. ఈ డిమాండ్‌ను సాధనకు ఢిల్లీ వరకు వచ్చి పోరా టం చేస్తున్న రైతులను ఆయన అభినందించారు. రైతాంగ సమస్యలను విస్మరించి రాజధాని అంశాన్ని తెగే వరకూ లాగొద్దని సీఎం జగన్‌కు సూచించారు.

సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటున్న ప్రధాని మోదీ ఏపీ ప్రజలకు అండగా లేరన్నారు. ప్రధాని మోదీ ఏపీ పర్జలను మోసం చేసారంటూ ఆరోపించారు. రైతాంగ సమస్యలను విస్మరించి రాజధాని అంశాన్ని తెగే వరకూ లాగొద్దని రాజా సూచించారు.

ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని

టీడీపీ ముగ్గురు ఎంపీలు దీక్షకు హాజరయ్యారు. దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘంగా రైతుల ఉద్యమం జరగలేదని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు చెప్పుకొచ్చారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులంటూ రైతులను అవమానించారని, రియల్‌ వ్యాపారులు ఎక్కడైనా ఇంత సుదీర్ఘంగా రోడ్లపై కూర్చొని ధర్నాలు చేయడం చూశారా అని ప్రశ్నించారు.

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో ముందుకెళ్లాలన్నారు. రాజధానిని మార్చాలంటే రాష్ట్ర విభజన చట్టాన్ని మార్చాల్సి ఉంటుందని, ఆ అధికారం పార్లమెంటుకే ఉంటుందని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు.

రాజధానిని మార్చే శక్తి ఎవరికీ లేదన్నారు. రాజధాని ప్రాంత రైతులకు కాంగ్రెస్‌ పార్టీ న్యాయ సాయం చేస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హామీ ఇచ్చారు. రైతు కంట తడి పెట్టించిన ఏ ప్రభుత్వం, ఏ నేత బాగుపడలేదని జనసేన నేత హరిప్రసాద్‌ అన్నారు. అమరావతి రైతుల త్యాగాన్ని తమ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ గుర్తించారని చెప్పారు

విశాఖకు తరలే ప్రసక్తే లేదు - పార్లమెంట్ లో నిలదీస్తాం

విశాఖకు తరలే ప్రసక్తే లేదు - పార్లమెంట్ లో నిలదీస్తాం

అమరావతి రైతులకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ మద్దతు ప్రకటించారు. ఏప్రిల్‌ నుంచి విశాఖ నుంచి పరిపాలన జరుగుతుందని మం త్రులు రకరకాలుగా మాట్లాడుతున్నారని, రాజధాని విశాఖకు తరలిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సుశీల్‌ కుమార్‌ గుప్తా డిమాండ్‌ చేశారు.

అమరావతినే కాకుండా రాష్ట్రాన్ని కూడా జగన్‌ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని సీపీఎం జాతీయ నేత అరుణ్‌ కుమార్‌ ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా జగన్‌ అంగీకరించారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఖరిని మార్చుకోవడమంటే వేలాది మంది రైతులను మోసం చేయడమేనని సీపీఎం ఎంపీ శివదాసన్‌ అన్నారు.

అమరావతి రైతుల ఆశయాలను పట్టించుకోక పోవటం చాలా అన్యాయమైన చర్య అని బీఎస్పీ ఎంపీ డానిశ్‌ అలీ అన్నారు. పార్లమెంట్ లో అమరావతి అంశాన్ని నిలదీస్తామని పలువురు ఎంపీలు హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+