అమరావతి రైతుల విలవిల- అప్పులు, సేల్ డీడ్లు..!!
అమరావతి రైతులు ఆవేదనలో ఉన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పుడు ఆర్దికంగా సహకారం అందటం లేదు. బ్యాంకులు అప్పులు ఇవ్వటం లేదు. చేతిలో ఉన్న భూమి రాజధాని కోసం త్యాగం చేసారు. ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. దీంతో, ఎక్కడా అప్పు పుట్టటం లేదు. దీంతో, ప్రయివేటు ఫైనాన్సర్ల ను ఆశ్రయిస్తున్నారు. తమకు ప్లాట్లు అమ్మినట్లు సేల్‌డీడ్లు రాయించుకొని అప్పు ఇస్తున్నారు. దీంతో, ఇప్పుడు రైతులు ఆవేదన చెందుతున్నారు.
అమరావతి రైతుల్లో ఆవేదన కనిపిస్తోంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అప్పు ఎక్కడా అందటం లేదు. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వటం లేదు. చేతిలో భూమి లేకపోవటంతో వ్యవసాయ పరపతి సంఘాలూ రుణాలివ్వడం లేదు. దీంతో, ప్రయివేటు ఫైనాన్షియర్లను ఆశ్రయించి తమ ప్లాట్ల సేల్ డీడ్ రాసి మరీ రుణాలు తెచ్చుకోవాల్సి వస్తోంది. గతంలో రైతులకు పొలాల పైన వ్యవసాయ రుణాలు వచ్చేవి. పొలాను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ వెసులుబాటు అమరావతి రైతులు కోల్పోయారు.

ప్రభుత్వానికి రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు. వారికి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల పై
రుణాలు ఇవ్వాటానికి బ్యాంకులు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇక, వ్యక్తిగత అవసరాల కోసం అప్పు పొందాలంటే ఈ ప్లాట్లను అమ్మినట్లు ప్రయివేటు ఫైనాన్షియర్లు రిజిస్టర్ చేయించుకుంటు న్నారు. అధిక వడ్డీలతో పాటుగా రిజిస్టర్ ఖర్చులు కూడా రైతులే భరిస్తున్నారు. అప్పు తీర్చిన తరువాత తిరిగి తమ పేరుతో రిజిస్టర్ చేయించుకోవటానికి ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం గజం రూ.60, 70 వేలు ఉన్న ప్లాట్ల ధరలను రూ.15 నుంచి 20 వేలు తగ్గిస్తున్నారు. దీంతో, భూములు ఇచ్చిన రైతులు ఆవేదన చెందుతున్నారు. సీఆర్డీఏ, ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు.












Click it and Unblock the Notifications