రాష్ట్రం విడిపోయినందున, బాబు చేస్తారు: బాలకృష్ణ, దేవాన్ష్‌ను ముద్దు చేసిన మోడీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన వేడుకలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని అమరావతి విరాజిల్లాలని ఆకాంక్షించారు. చంద్రబాబు అభివృద్ధి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
బాలకృష్ణ మాట్లాడుతూ... ఈ చారిత్రాత్మక ఘట్టం జరుగుతున్న సందర్భంగా, అమరావతి శంకుస్థాపన సందర్భంగా హాజరైన ప్రజలకు, అభిమానులకు, రైతులకు, ప్రముఖులకు, ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, ఇతర ప్రముఖులకు, తెలుగుంటి ఆడపడుచులకు, భూమి ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు అన్నారు.
Photos: అమరావతి శంకుస్థాపన
తెలుగు ప్రజలకు ఎంతో చరిత్ర ఉందన్నారు. తెలుగు జాతిది గర్వించదగ్గ చరిత్ర అన్నారు. సమైక్య ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడినందున రాజధానిని నిర్మిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారో.. ఈ కొత్త రాష్ట్రాన్ని కూడా అలాగే అభివృద్ధి చేస్తారని ఆశించారు.

బాలకృష్ణ సందడి
బాలకృష్ణ అమరావతిలో సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న వేదిక పైకి ఎక్కి కార్యక్రమానికి హాజరైన అందరికీ అభివాదం చేశారు. అంతకు ముందు తన మనవడు నారా దేవాన్ష్‌ను ఎత్తుకుని ముద్దాడారు.ఈ సందర్భంగా బాలయ్య చుట్టూ పలువురు మంత్రులు, నేతలు గుమిగూడారు.

మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాతలు కూడా దేవాన్ష్‌ను ఎత్తుకుని ముద్దాడారు. మొత్తం మూడు బస్సుల్లో ఎన్టీఆర్ కుటుంబమంతా అమరావతికి తరలి వచ్చింది.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంకుస్థాపన వేడుక వద్దకు వచ్చారు. లోకేష్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్‌ను ముద్దు చేశారు. అనంతరం అమరావతి ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు.












Click it and Unblock the Notifications