లోకేష్ కొడుకు దేవాన్ష్ హ్యాష్ ట్యాగ్, ట్విట్టర్లో జోరు: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసంతృప్తి!

అమరావతి: ఏపీ రాజధాని అమరావతికి భారీ మద్దతు కూడగట్టే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన మన అమరావతి - మన రాజధానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోంది.

పార్టీ పిలుపు మేరకు సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ కమిటీ కార్యదర్శి లోకేశ్‌లతో పాటు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌లు మన అమరావతి - మన రాజధాని హ్యష్ ట్యాగ్‌లు పట్టుకుని తీసుకున్న ఫొటోలు ట్విట్టర్‌లోకి బుధవారం చేరాయి.

వీటిని చూసిన చాలామంది స్వచ్ఛందంగా తాము కూడా సదరు హ్యాష్ ట్యాగ్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని వాటిని ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలకు ట్వీట్లు, రీ ట్వీట్లు పోటెత్తుతున్నాయి.

కాగా, టిడిపి యువనేత నారా లోకేష్ గురువారం ట్వీట్ చేశారు. అందరం గర్వించదగ్గ సమయం ఆసన్నమైందని ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్ అభిమానుల అసంతృప్తి

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకింత అసంతృప్తికి గురయ్యారు. పవన్‌కు స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వాన పత్రికను అందించకపోవడంపై వారు అసంతృప్తికి గురవుతున్నారని తెలుస్తోంది.

సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపి - బిజెపి కూటమి తరఫున ప్రచారం చేశారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు రామోజీ రావును, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి ఆహ్వానించారు. వారిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్‌ను స్వయంగా ఎందుకు కలవలేదని అంటున్నారు. తిరుపతిలో అభిమానులు ధర్నా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+