అమరావతిపై కేంద్రం భారీ గుడ్ న్యూస్, కొత్త చరిత్ర..!!
అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయం జరగనుంది. కేంద్రం ఇప్పటికే అమరావతికి ఆర్దికంగా తోడ్పాటు అందిస్తోంది. ఇదే సమయంలో అమరావతి రైతులు కోరుతున్న విధంగా మరో కీలక నిర్ణయం ఆమోదానికి రంగం సిద్దమైంది. ఇందుకు వచ్చే నెలా పార్లమెంట్ సమావేశాలు వేదికగా మారనున్నాయి. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అధికారికంగా ఆమోద ముద్ర పడనుంది. ఇది అమరావతి భవిష్యత్ కు కీలక మలుపు కానుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ధ్రువీకరించే గెజిట్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం దిశగా కసరత్తు జరుగుతోంది. త్వరలో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అమరావతి రాజధాని బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ వెల్లడించారు. ఈ బిల్లుకు సంబంధించి ప్రాధమికంగా కసరత్తు జరిగింది. కాగా, ప్రస్తుతం హోం శాఖలో ఫైల్ క్లియర్ అయ్యిందని.. న్యాయ శాఖలో పరిశీలనలో ఉందని సమాచారం. ఈ గజెట్ ద్వారా అమరావతి ఇక ఏపీ శాశ్వత రాజధానిగా రాజ ముద్ర పడనుంది. రాజకీయంగా భవిష్యత్ లోనూ ఎలాంటి మార్పులకు ఎవరికీ అవకాశం ఉండదు. అమరావతి రైతులు చాలా రోజులుగా ఈ తరహా గజెట్ కోసం అభ్యర్ధిస్తూ వచ్చారు. ఇప్పుడు కేంద్రంలో జరుగుతున్న కసరత్తు ఆధారంగా డిసెంబర్ పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.

ఇక, రైతులకు ఇచ్చిన హామీల అమలులో భారీ పురోగతి సాధించామని పెమ్మసాని తెలిపారు. ఇప్పటివరకు 98 శాతం మంది రైతులకు రిటర్న్ ప్లాట్ల పంపిణీ పూర్తయ్యిందని పేర్కొన్నారు. మిగి లిన రెండు శాతం సమస్యలను కూడా తొందరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే 15 ఏండ్లలో జనాభా పెరుగుదల, ఆర్థిక కార్యకలాపాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రవాణా, మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఏరియాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు.గ్రామకంఠాల విషయంలో గైడ్ లైన్స్ పాటించకుండా చేసినందు వల్ల 36 ఎకరాల్లో సమస్యలు వచ్చాయని కేంద్రమంత్రి వివరించారు. గ్రామ కంఠాలలో ఎవ్వరికైనా ఎక్కువ ఇచ్చినట్టు గుర్తిస్తే వాటిపై రీ సర్వే చేస్తామన్నారు. 30 రోజుల్లో అడిషనల్ కమిషనర్ రిపోర్ట్ తీసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications