ఎల్లుండి విశాఖలో ఫిలింనగర్‌కు బాబు శంకుస్థాపన, 'అమరావతి' పత్రిక విడుదల
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లుండి (సోమవారం) ఫిలిం నగర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీకి శంకుస్థాపన చేస్తారు.

అమరావతిలో జేబీఐసీ పెట్టుబడికి అవకాశం
అమరావతి నిర్మాణంలో పెట్టుబడులు పెట్టే అంశంపై జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ బ్యాంకు(జేబీఐసీ)తో ఏపీ ప్రతినిధి బృందం కూలంకుంషంగా చర్చించింది. ఈక్విటీ పద్ధతిలో రాజధాని నిర్మాణంలో జేబీఐసీ భాగస్వామ్యమయ్యే అవకాశాలపై చర్చించారు.
సిస్మెక్స్, నైడెక్స్ కార్పొరేషన్‌లు కూడా ఏపీలో తమ యూనిట్లను నెలకొల్పడానికి సుముఖత వ్యక్తం చేశాయి. నైడెక్స్ కార్పొరేషన్ వావానాల్లో శీతల మోటార్ల తయారీలో పెద్ద కంపెనీగా ఉంది. మరోవైపు సూట్‌కేసులు, బట్టలకు వాడే జిప్‌లను తయారుచేసే వైకేకే కంపెనీ ప్రతినిధులతోను ప్రతినిధి బృందం చర్చించింది.
ఆ కంపెనీ కూడా ఏపీలో తమ యూనిట్‌ను పెట్టేందుకు సానుకూలంగా స్పందించింది. ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పివిరమేష్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌లు జపాన్‌లో మూడురోజుల పాటు పర్యటించారు. శుక్రవారం రాత్రి వారి పర్యటన పూర్తయింది.
అమరావతి ఆహ్వాన పత్రిక మీడియాకు విడుదల
అమరావతి శంకుస్థాపన వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక మోడల్‌ను ఏపీ ప్రభుత్వం శనివారం నాడు మీడియాకు విడుదల చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. దీనిని విజయవాడ కేబినెట్ సమావేశంలో మీడియాకు విడుదల చేశారు.












Click it and Unblock the Notifications