అమరావతి ఇక ప్రత్యేకంగా - తాజా నిర్ణయం, కీలక మలుపు..!!

అమరావతి కేంద్రంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాజధానికి అమరావతికి చట్ట బద్దత కల్పించటంతో ఇక.. కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ప్రస్తుత నిర్మాణాలు 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇదే సమయంలో రెండో విడత భూ సమీకరణ వేగవంతం చేసింది. అమరావతి కోసం ఇక ప్రత్యేకంగా మరో ప్రతిపాదన పైన కసరత్తు జరుగుతోంది. దీని ద్వారా అమరావతి కొత్త రూపు సంతరించుకోనుంది.

అమరావతి కేంద్రంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతికి ప్రత్యేక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాలనాపరమైన వ్యవస్థీకృత ఏర్పాట్ల కోసం సమగ్ర నివేదిక తయారు చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించింది. అమరా వతి స్వయం పాలక సంస్థగా మారిన తరువాత దానికి ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయించే అంశం పై నివేదికను సిద్దం చేయాలని, పుర పాలక శాఖలో ఉన్న చట్టాలను పరిశీలించి మెరుగైన పద్ధతులకు సూచనలు చేయాలని టెండర్‌ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. అక్రమాలు, అవినీతి, అనధికారిక నిర్మాణాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా ఈ వ్యవస్థ ఉండాలని సూచించింది. ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లలో కీలక అంశాలను ప్రస్తావించారు.

amaravati-likely-to-take-new-look-soon-with-ap-govt-crda-latest-decisions-here-the-details

అమరావతి కేంద్రంగా వరుస నిర్ణయాలు

గతంలోనే ఆర్థిక వనరుల నిర్వహణ, యూజర్‌ ఛార్జీలు, డెవలప్‌మెంట్‌ ఛార్జీల వసూలుకు ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. మొత్తంగా పరిపాలన కోసం ఒక అపెక్స్‌బాడీ ఏర్పాటుకు వీలుగా ప్రస్తుతంపట్టణాభివృద్ధిశాఖ చట్టాల్లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, అందులో మెట్రోపాలిటన్‌ ప్లానింగు వర్తిస్తుందా లేదా పరిశీలించనున్నారు. అమరావతిని ప్రత్యేక జిల్లాగా ప్రతిపాదిస్తే భూఆదాయ వివరాలను ఎలా ఉండాలనే అంశాన్ని కూడా చేర్చాలని, యంత్రాంగం విధులనూ నిర్దేశించేలా ప్లాను ఉండాలని పేర్కొన్నారు. రాజధాని, ఇతర పరిపాలనా సంస్థల మధ్య సమన్వయం ఎలా ఉండాలనేది, ఆర్థిక వికేంద్రీ కరణ, పిపిపికి అవసరమైన రక్షణ చర్యలను సూచించా లని పేర్కొన్నారు. అమరావతిలో సమగ్ర పరిపాలన సౌలభ్యం కోసం భవిష్యత్‌లో మెట్రోపాలిటన్‌, నగరం, జోన్‌, క్లస్టర్‌ స్థాయిల్లో ప్రత్యేక ప్లాను చేయాలని సూచించారు. అపెక్స్‌ బాడీ నేరుగా నిధులు సమీకరించుకునేం దుకు అధికారాలు కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ టెండర్లలో వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+