అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రతుల దహనం: రైతులతో మాట్లాడాలని క్యాబినెట్
విజయవాడ: అమరావతి మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ సీఆర్డీఏ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రాజధాని మాస్టర్‌ప్లాన్ ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ ప్లాన్ వల్ల వేలాది ఎకరాలు పంట భూములు నాశనం అవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాన్‌ను మార్చాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. కాగా, రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడాలని ఆంద్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పలు సాగునీటి ప్రాజెక్టులకు పరిపాలనాపరమైన అనుమతలు ఇస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా జీవిత ఖైదీల విడుదలకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.
రాజధాని రైతాంగంలో అపోహలు పెరిగాయని, కొంతమంది పనిలేని వారు అపోహలు సృష్టిస్తున్నారని చంద్రబాబు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. మాస్టర్‌ప్లాన్‌లోని రహదారులపై మంత్రులు తెలియకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రహదారుల దిశను మారిస్తే అనుకున్న విధంగా రాజధాని రాదు, అప్పుడు రైతులు, ప్రభుత్వం ఇద్దరూ మునిగిపోతారంటూ చెప్పుకొచ్చారు.

రెండు మూడ్రోజుల్లో రాజధాని రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటామని, ఏ ఒక్కరైతు కూడా ఇబ్బంది పడకండా చూస్తామన్నారు. రైతన్నలను అన్నివిధాలు ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు.
రాజధానికి పంటభూములు తీసుకోవద్దన్న నాయకులే ఇప్పుడు వ్యవసాయ పరిరక్షణ జోన్ వద్దంటున్నారని ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. రాజధానికి స్విస్ చాలెంజ్‌లో వచ్చిన సింగపూర్ సంస్థలు కొన్ని షరతులు పెట్టాయని, అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి షరతులు తొలగించి కొత్త ప్రతిపాదనలతో చెప్పామని సీఎం చంద్రబాబు మీడియాతో తెలిపారు.
పట్టిసీమపై విచారణ వాయిదా
పట్టిసీమ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ నేత వట్టి వసంత్‌కుమార్ చేసిన పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. వసంత్‌కుమార్ తరపున మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలు వినిపించారు. విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications