రియల్ ఎస్టేట్ బ్రోచర్‌లా: అమరావతి మాస్టర్ ప్లాన్‌పై రోజా విసుర్లు
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మాస్టర్ ప్లాన్ రియల్ ఎస్టేట్ బ్రోచర్‌లా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు రోజా విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది దాటినా, ఇంకా రాజధాని నిర్మాణానికి బ్లూ-ప్రింట్, మాస్టర్ ప్లాన్ వద్దే ఉన్నారని ఆమె విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం చూస్తుంటే రాజధాని నిర్మాణానికి మరో 35 సంవత్సరాలు పడుతుందని స్పష్టమవుతున్నదని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత వరకు ఒక్క రూపాయి విదల్చలేదని ఆమె విమర్శించారు.

రైతుల వద్ద భూసేకరణ చేసి వారికి నష్టపరిహారం చెల్లించలేదని, దీంతో వారి జీవనాధారం ఎలా గడుస్తుందని ఆమె అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారికి నష్టపరిహారం చెల్లించాలని, రాజధాని నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని బృహత్తర ప్రణాళికకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన వీడియోను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా మగధీర, బాహుబలి సినిమాలతో పోల్చిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ హీరోగా మగధీర, ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమాలు వచ్చాయి. వీటితో రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఆమె పోల్చారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications